https://oktelugu.com/

Mobile Slow:ఫోన్ స్లో అవుతుందా..? ఈ చిన్న ట్రిక్ ద్వారా ఫాస్ట్ చేసుకోండి..

మొబైల్ లోని ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే పైన రైట్ సైడ్ లో ప్రొఫైల్ సర్కిల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో General దానిని ఎంచుకోవాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : April 2, 2024 / 01:37 PM IST

    moblile slow

    Follow us on

    Mobile Slow: నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ తప్పనిసరిగా ఉంటుంది. ప్రతీ అవసరం మొబైల్ తీరుస్తుంది. అంతేకాకుండా వివిధ పనులకు మొబైల్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంల స్మార్ట్ మొబైల్ ఉన్న వారు పాస్ట్ నెట్ వర్క్ ను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు 2జీ నెట్ వర్క్ తో ఇబ్బందులకు గురైన వారు.. ఇప్పుడు ఎక్కువగా 5 జీతో గడిపేస్తున్నారు. దీంతో నెట్ వర్క్ ఫాస్ట్ గా ఉండి.. కావాల్సిన సమాచారం తొందరగా అందుతుంది. కానీ ఇదే సమయంలో ఫోన్ ఒక్కోసారి స్లో(హ్యాంగ్) అవుతుంది. అత్యవసరం సమయంలో ఈ పరిస్థితి ఎదురైతే చికాకు వస్తుంది. ఇలా హ్యాంగ్ కాకుండా ఉండాలంటే ముందుగా ఈ చిన్న టిప్ ఫాలో అయితే సరిపోద్ది..

    ఏదైనా అవసరం కోసం ఇప్పుడంతా యాప్ లపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో మొబైల్ లో పదుల కొద్దీ యాప్ లు ఇన్ స్టాల్ చేసుకుంటున్నారు. కొన్ని కావాలని డౌన్లోడ్ చేసుకుంటే మరికొన్ని వాటంతట అవే మొబైల్ లోకి వచ్చి చేరుతున్నాయి. మొబైల్ ఇంటర్నెట్ ఆన్ చేసిన ప్రతీ సారి ప్రతీ యాప్ రన్ అవుతూ ఉంటుంది. కానీ వీటిని ఓపెన్ చేసి బ్యాగ్రౌండ్ లో ఉంచడం వల్ల డేటా ను ఖర్చు చేస్తాయి. దీంతో మొబైల్ నెట్ అంతా ఆ యాప్ లకే యూజ్ అయి మొబైల్ స్లో అవుతుంది.

    దీని వల్ల మొబైల్ డేటా తొందరగా ఖర్చు కావడమే కాకుండా హ్యాంగ్ అయి ఇబ్బందులకు గురి చేస్తుంది. మొబైల్ లోకొన్ని యాప్ లను ఇన్ స్టాల్ చేసుకున్న తరువాత వాటి అవసరం ఎప్పుడో ఉంటుంది. అలా ఎక్కువగా యూజ్ చేయని యాప్స్ రన్ చేయకుండా ఉంచితే డేటా సేవ్ చేసిన వాళ్లవమతాం. అంటే వాటిని స్లీపింగ్ లో ఉంచాలన్నమాట. వీటి అవసరం లేనపప్పుడు మొబైల్ డేటా ఖర్చు కాకుండా ఉండాలంటే ముందుగా ప్లే స్టోర్ లోకి వెళ్లాలి.

    మొబైల్ లోని ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే పైన రైట్ సైడ్ లో ప్రొఫైల్ సర్కిల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో General దానిని ఎంచుకోవాలి. ఇందులోకి వెళ్లిన తరువాత Settingsపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మరికొన్ని ఆప్షన్ష్ వస్తాయి. ఇందులో Archieve ను ఆఫ్ లో ఉంటే దానిని On చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రన్ చేయని యాప్స్ అన్నీ ఆర్చీవ్ లోకి వెళ్తాయి. దీంతో మొబైల్ డేటా ఖర్చు కాకుండా ఉండడంతో పాటు ఫోన్ హ్యాంగ్ కాకుండా ఉంటుంది.