https://oktelugu.com/

Jr NTR: ఎన్టీఆర్ మొదటి సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇదేనా..?

'నిన్ను చూడాలని' సినిమా ఎన్టీయార్ కు సక్సెస్ ను అందించలేకపోయింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ సినిమా ఆయనకైతే చేదు అనుభవం మిగిల్చింది.

Written By:
  • Gopi
  • , Updated On : March 8, 2024 / 03:24 PM IST

    NTR first film

    Follow us on

    Jr NTR: నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఎన్టీయార్ తను చేసిన మొదటి ప్రయత్నంలోనే భారీగా దెబ్బ తిన్నాడు. అయితే రామోజీరావు ప్రొడ్యూసర్ గా వీఆర్ ప్రతాప్ డైరెక్షన్ లో వచ్చిన ‘నిన్ను చూడాలని’ సినిమా ఎన్టీయార్ కు సక్సెస్ ను అందించలేకపోయింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ సినిమా ఆయనకైతే చేదు అనుభవం మిగిల్చింది.

    అయితే ఈ సినిమా కథ పరంగా ఓకే అనిపించినప్పటికీ, సినిమాలో కొన్ని మిస్టేక్స్ అయితే దర్శకుడు చేశాడు. అందువల్ల ఈ సినిమా పెద్దగా విజయాన్ని సాధించలేదు. దర్శకుడు వాటిని గుర్తించగలిగితే బాగుండేది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన ఎపిసోడ్స్ కొన్నింటిని చిత్రీకరించడంలో దర్శకుడు నిర్లక్ష్యం వహించినట్టుగా అర్థమైంది. ఇక స్క్రిప్ట్ పరంగా కూడా దర్శకుడు ఈ సినిమాకి ఒక బలమైన కథను ఎంచుకోలేకపోయాడు. ఇక స్క్రీన్ ప్లే అయితే మరి దారుణంగా ఉంటుంది. ఇలా వీటన్నింటి వల్ల ఎన్టీఆర్ కి మొదటి సినిమా అనేది ప్లాప్ గా మిగిలింది.

    అయినప్పటికీ రెండోవ సినిమా గా రాజమౌళి దర్శకత్వం లో చేసిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకొని అప్పటినుంచి ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా దూసుకుపోతున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల డైరెక్షన్ లో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోబోతున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఇంతకుముందు త్రిబుల్ ఆర్ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించిన ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో రికార్డులు బ్రేక్ చేయాలని చూస్తున్నాడు.

    మరి ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్క అభిమానికి ఈ సినిమా మీద భారీ నమ్మకం అయితే పెరిగిపోయింది. ఇక దానివల్ల ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…