Homeఎంటర్టైన్మెంట్Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్ మూవీ సెట్స్ లో నందమూరి బాలకృష్ణ.....

Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్ మూవీ సెట్స్ లో నందమూరి బాలకృష్ణ.. ఫ్యాన్స్ కి విజువల్ ఫీస్ట్..

Sai Dharam Tej : మెగా ఫ్యామిలీ నుండి నందమూరి హీరోలతో మంచి రిలేషన్ ని మైంటైన్ చేసే హీరోల్లో ఒకరు సాయి ధరమ్ తేజ్. ఈయనకు జూనియర్ ఎన్టీఆర్ ఎంత మంచి స్నేహితుడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విన్నర్ మూవీ ఓపెనింగ్ రోజు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కూడా కొట్టారు. అంతే కాదు , మెగా ఫ్యామిలీ హీరోలు కాకుండా, బయట హీరోల్లో మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు అని సాయి ధరమ్ తేజ్ ని అడిగితే , క్షణం కూడా ఆలోచించకుండా ఎన్టీఆర్ పేరు చెప్తాడు ఒక ఇంటర్వ్యూ లో. కేవలం ఎన్టీఆర్ తో మాత్రమే కాదు , ఇండస్ట్రీ లో అందరితోనూ సాయి ధరమ్ తేజ్ కి మంచి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. టాలీవుడ్ లో ఏ హీరో సినిమా విడుదలైనా సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్తుంటారు.

సీనియర్ హీరోలతో కూడా సాయి ధరమ్ తేజ్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. గతం లో ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ టాక్ షోలో పాల్గొన్నప్పుడు, సాయి ధరమ్ తేజ్ బాలయ్య బాబు తో చేసిన అల్లరి ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. వీళ్లిద్దరి మధ్య ఇంత మంచి రిలేషన్ ఉందా అని అప్పట్లో చూసిన ప్రతీ ఒక్కరు అనుకునేవారు. ఇక నేడు సాయి ధరమ్ తేజ్ హీరో గా నటిస్తున్న ‘సంబరాల యేటి గట్టు’ మూవీ సెట్స్ లో తళుక్కుమని మెరిశారు బాలయ్య. పక్కనే తన సినిమా షూటింగ్ కూడా జరుగుతుండడం తో , ఒక్కసారి కలిసి వెళ్లేందుకు ఈ సెట్స్ లోకి అడుగుపెట్టిన బాలయ్య , కాసేపు మూవీ టీం తో సరదాగా గడిపి వెళ్లారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఫ్యాన్స్ ఫోటోల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ‘సంబరాల యేటి గట్టు’ సినిమా విషయానికి వస్తే , ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మొట్టమొదటి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం. షూటింగ్ మొదలై దాదాపుగా రెండేళ్లు అయ్యింది , ఇప్పటికీ పూర్తి అవ్వలేదు. 2024 దసరా కానుకగా విడుదల చేద్దామని అనుకున్నారు , షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో వాయిదా వేశారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదల చెయ్యాలని చూస్తున్నారు మేకర్స్. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని , టయర్ 1 రేస్ లోకి అడుగుపెట్టాలని చూస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version