https://oktelugu.com/

Nagarjuna: నాగార్జున డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా..?

మాస్ యాక్షన్, లవ్ రొమాంటిక్, భక్తిరస చిత్రాలన్నింటిలో నటించి మెప్పించిన నటుడిగా నాగార్జునకు ఇండస్ట్రీలో ఒక మంచి పేరు అయితే ఉంది.

Written By:
  • Gopi
  • , Updated On : March 4, 2024 / 02:17 PM IST

    Nagarjuna-dream-role

    Follow us on

    Nagarjuna: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు కొన్ని సినిమాలని మాత్రమే చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక మరి కొంత మంది హీరోలు మాత్రం అన్ని జానర్లని టచ్ చేస్తూ సినిమాలు చేస్తూ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. ఇక అక్కినేని హీరో అయిన నాగార్జున తన కెరియర్ మొదటి నుంచి కూడా వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తూ వస్తున్నాడు.

    ఇక పాతికేళ్ల వయసులోనే భక్తిరస ప్రధానమైన ‘అన్నమయ్య ‘ సినిమాలో నటించి మెప్పించాడు అంటే ఆయనకున్న డెడికేషన్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మాస్ యాక్షన్, లవ్ రొమాంటిక్, భక్తిరస చిత్రాలన్నింటిలో నటించి మెప్పించిన నటుడిగా నాగార్జునకు ఇండస్ట్రీలో ఒక మంచి పేరు అయితే ఉంది. ఇక ఇదిలా ఉంటే తన ఎంటైర్ కెరియర్ లో ఒక్కసారైనా ఒక పాత్రలో నటించి మెప్పించాలని చూస్తున్నాడు. అది ఏ క్యారెక్టర్ అంటే అడ్వెంచర్ జానర్లో సాహసోపేతమైన సినిమాలు చేసే క్యారెక్టర్ లో తను నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నప్పటికీ అలాంటి క్యారెక్టర్ అయితే ఆయనకు దొరకడం లేదంటూ ఒకానొక సందర్భంలో తను తెలియజేశాడు.

    చిరంజీవి లాంటి స్టార్ హీరో సైతం ‘అంజి ‘ లాంటి అడ్వెంచర్ జానర్ కి సంబంధించిన సినిమాలో నటించి నటుడిగా సక్సెస్ అయ్యాడు. కానీ నాగార్జున మాత్రం అలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు కనక అలాంటి పాత్ర తన దగ్గరికి తీసుకెళ్తే ఆ క్యారెక్టర్ లో నటించి మెప్పించడానికి తను సిద్ధంగా ఉన్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

    మరి నాగార్జున తన డ్రీమ్ రోల్ ని సక్సెస్ ఫుల్ గా హ్యాండిల్ చేసి తనకి అదిరిపోయే హిట్టు అందించే దర్శకుడు ఎవరు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక మొత్తానికైతే ప్రస్తుతం నాగార్జున వరుస సినిమాలను చేస్తూ సీనియర్ హీరోల్లో మంచి బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్న స్టూడెంట్స్ తో కూడా తనకి నచ్చిన స్క్రిప్ట్స్ రాయించుకుంటున్నట్టుగా తెలుస్తుంది…ఇక తొందర్లోనే నాగార్జున అడ్వెంచర్ జానర్ లో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా తెలుస్తుంది…