https://oktelugu.com/

NTR-Rajamouli: ఎన్టీయార్ కోసం రాజమౌళి రాసుకున్న ఈ స్టోరీ ఎందుకు పట్టలెక్కలేదంటే..?

రాజమౌళి డెడికేషన్ ముందు సక్సెస్ అనేది చాలా చిన్నదనే చెప్పాలి. ఎలాంటి కథతో అయిన సినిమా చేయగల సమర్థుడు. ఇక సినిమా విషయం లో మొదటి నుంచి చివరి వరకు చాలా కష్టపడి మరి ఆ సినిమాని సక్సెస్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్తాడు.

Written By:
  • Gopi
  • , Updated On : March 4, 2024 / 02:22 PM IST

    Rajamouli and NTR

    Follow us on

    NTR-Rajamouli: ప్రస్తుతం ఇండియా లోనే నెంబర్ వన్ దర్శకుడుగా కొనసాగుతున్న రాజమౌళి(Rajamouli)…ఇప్పుడు మహేష్ బాబుని(Mahesh Babu) హీరోగా పెట్టి పాన్ వరల్డ్ లో ఒక భారీ సినిమాను తీయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఇండియాలోనే ఎవరు సాధించాలేని రికార్డులను రాజమౌళి సాధించడం విశేషం.. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్టుగా, మొదట తెలుగులో వరుస సక్సెస్ సినిమాలను సాదించిన రాజమౌళి, ఆ తర్వాత పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్నాడు. ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

    ఇక రాజమౌళి డెడికేషన్ ముందు సక్సెస్ అనేది చాలా చిన్నదనే చెప్పాలి. ఎలాంటి కథతో అయిన సినిమా చేయగల సమర్థుడు. ఇక సినిమా విషయం లో మొదటి నుంచి చివరి వరకు చాలా కష్టపడి మరి ఆ సినిమాని సక్సెస్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్తాడు. అందుకోసమే రాజమౌళి సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడ్యూసర్లు గాని, హీరోలు కూడా ఆయన సినిమాలో ఒక చిన్న పాత్ర చేయడానికి సైతం పోటీ పడుతుంటారు. ఇక ఇదిలా ఉంటే సింహాద్రి సినిమా తర్వాత రాజమౌళి ఎన్టీఆర్(NTR) తో ఒక భారీ గ్రాఫికల్ సినిమా చేయాలని అనుకున్నాడు. దానికి ‘గరుడ ‘ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.

    ఇక అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఆ సినిమాకి దాదాపు 50 కోట్ల వరకు బడ్జెట్ అవుతుండటంతో దానికి బడ్జెట్ హెవీ గా అవుతుందని భావించిన రాజమౌళి. మళ్లీ ఈ సినిమా అన్ని కోట్ల డబ్బులను వసూలు చేయగలదా లేదా అనే ఒక చిన్న డైలమాలో పడ్డాడట. దాంతో అప్పుడు ఆ స్క్రిప్ట్ ని చేయడం కరెక్ట్ కాదు అని దాన్ని పక్కన పెట్టేసి సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చాడు. ఇక యమదొంగ సినిమాను గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో వాడిన గ్రాఫిక్స్ ని బేస్ చేసుకొని రాజమౌళి చేసిన మగధీర సినిమాలో ఔట్ అండ్ అవుట్ పూర్తిగా గ్రాఫిక్స్ ను వాడి సినిమా చేసి సక్సెస్ ని సాధించాడు…

    ఇక ఆ తర్వాత వరుసగా గ్రాఫిక్స్ సినిమాలు చేసుకుంటూ వస్తున్న రాజమౌళి అప్పుడు పెండింగ్ లో పడిన గరుడ సినిమాను ఇప్పటికీ పట్టలెక్కించలేకపోయాడు. ఇప్పుడు కనక ఆ సినిమాను తీసినట్టైతే అది ఎన్టీఆర్ తో చేస్తాడా లేదా మరి వేరే హీరోతో చేస్తాడా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…