Zebra Movie In OTT : నటుడు సత్యదేవ్ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఈ హీరోకి బ్రేక్ రావడం లేదు. ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఒక్క కమర్షియల్ హిట్ పడటం లేదు సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ జీబ్రా. క్రైమ్ థ్రిల్లర్ గా దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన పెంగ్విన్ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకుడిగా పని చేశాడు. జీబ్రా అతడి రెండో చిత్రం. నవంబర్ 22న జీబ్రా మూవీ విడుదలైంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది.
సత్యదేవ్ తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ కి ఆయన హాజరయ్యారు. జీబ్రా చిత్రానికి సపోర్ట్ ఇచ్చారు. జీబ్రా థియేటర్స్ లో ఆశించినంత స్థాయిలో ఆడలేదు. జీబ్రా థియేట్రికల్ రన్ కూడా ముగిసింది. పుష్ప 2 విడుదలయ్యాక థియేటర్స్ నుండి తీసేశారు. ఈ క్రమంలో ఓటీటీ విడుదలకు రెడీ చేస్తున్నారు. జీబ్రా డిజిటల్ రైట్స్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్.. ఆహా కొనుగోలు చేసింది. జీబ్రా డిజిటల్ స్ట్రీమింగ్ అంటూ ఆహా అధికారిక ప్రకటన చేసింది.
అయితే తేదీ ప్రకటించలేదు వారం రోజుల వ్యవధిలోనే జీబ్రా డిజిటల్ స్ట్రీమింగ్ మొదలయ్యే సూచనలు కలవు. జీబ్రా మూవీలో కన్నడ నటుడు ధనుంజయ మరో ప్రధాన పాత్ర చేశాడు. ప్రియా భవాని శంకర్, అమృత అయ్యంగార్ హీరోయిన్స్ గా నటించారు. సునీల్, సత్యరాజ్ వంటి నటులు కీలక రోల్స్ చేశారు.
జీబ్రా మూవీ కథ: సూర్య (సత్యదేవ్) ఒక ప్రైవేట్ బ్యాంకు లో ఎంప్లాయ్. స్వాతి(ప్రియా భవాని శంకర్) మరొక బ్యాంక్ లో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. వీరిద్దరి మధ్య అనుబంధం ఉంటుంది. స్వాతి చేసిన పొరపాటు వలన ఒక వ్యక్తి అకౌంట్ లో రూ. 4 లక్షలు జమ అవుతాయి. ఆ వ్యక్తి ఆ డబ్బులు ఖర్చు చేసుకుంటాడు. ఈ సమస్య నుండి సూర్య ఆమెను తన తెలివి తేటలతో బయటపడేస్తాడు. కాగా అదే వ్యక్తి అకౌంట్ నుండి రూ. 4 కోట్లు మాయం అవుతాయి. సూర్య, స్వాతి అనుకోని సమస్యల్లో ఇరుక్కుంటారు. నాలుగు కోట్లు కాజేసింది ఎవరు? డాన్ ఆది(ధనంజయ) నుండి సూర్యకు ఉన్న ముప్పేంటి? ఈ సమస్య నుండి ఎలా బయటపడ్డారు? అనేది మిగతా కథ…