Anirudh Ravichander: ఇంత బాగా మ్యూజిక్ చేసే అనిరుధ్ ఇంతకీ ఏం చదివాడో తెలుసా?

ధనుష్-శృతి హాసన్ జంటగా నటించిన 3 చిత్రంలోని 'వై దిస్ కొలవెరీ' సాంగ్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ సాంగ్ అనిరుధ్ పేరు ఇండియా వైడ్ వినిపించేలా చేసింది.

Written By: NARESH, Updated On : October 27, 2023 11:51 am
Follow us on

Anirudh Ravichander: యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ తన మ్యూజిక్ తో దేశాన్ని ఊపేస్తున్నాడు. గత ఐదేళ్లుగా కోలీవుడ్ ఆయన వెంటపడుతుంది. ఇతర పరిశ్రమలకు కూడా అనిరుధ్ మేనియా వ్యాపించింది. దీంతో అనిరుధ్ డిమాండ్ భారీగా పెరిగింది. నటుడు రవిచందర్ కుమారుడైన అనిరుధ్… రజినీకాంత్ కి వరసకు మేనల్లుడు అవుతాడు. అనిరుధ్ చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. ఫస్ట్ సినిమాతోనే సెన్సేషనల్ ఆల్బమ్ ఇచ్చాడు.

ధనుష్-శృతి హాసన్ జంటగా నటించిన 3 చిత్రంలోని ‘వై దిస్ కొలవెరీ’ సాంగ్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ సాంగ్ అనిరుధ్ పేరు ఇండియా వైడ్ వినిపించేలా చేసింది. టైర్ టు హీరోల రేంజ్ నుండి అనిరుధ్ స్టార్స్ చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చే స్థాయికి ఎదిగాడు. తెలుగులో అజ్ఞాతవాసి చిత్రంలో అడుగుపెట్టాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అనిరుధ్ పాటలు మాత్రం హిట్. పవన్ గత చిత్రాలకు భిన్నమైన ఆల్బమ్ ఇచ్చాడు.

ఇక గత ఏడాది విడుదలైన విక్రమ్, లేటెస్ట్ ఇండస్ట్రీ హిట్ జైలర్ చిత్రాలకు అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. ఈ రెండు చిత్రాల సక్సెస్ లో సంగీతం కీలక పాత్ర పోషించింది. బీజీఎం తో చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లాడు. విక్రమ్ రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా… జైలర్ రూ. 600 కోట్లు వసూలు చేసింది. రీరికార్డింగ్ కి ముందు జైలర్ సాదాసీదాగా అనిపించిందని రజినీకాంత్ స్వయంగా చెప్పడం విశేషం.

దేవర మూవీతో మరోసారి ఆయన టాలీవుడ్ ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ చిత్రానికి అనిరుధ్ రెమ్యునరేషన్ ఏకంగా రూ. 10 కోట్లని సమాచారం. ఇంత మంచి మ్యూజిక్ ఇస్తున్న అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటీ? అతడు ఏం చదువుకున్నాడు? పరిశీలిస్తే… చిన్నప్పటి నుండి అనిరుధ్ కి మ్యూజిక్ పట్ల ఆసక్తి ఉంది. వివిధ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మీద సాధన చేశాడు. సంగీతం, పాడటంలో ప్రావీణ్యం సాధించాడు. లండన్ వెళ్లి ప్రముఖ మ్యూజిక్ కాలేజ్ ట్రినిటీలో పియానో నేర్చుకున్నాడు. లండన్ కి చెందిన ఫ్యూజన్ బ్రాండ్ తో పని చేశాడు. అలాగే సౌండ్ ఇంజినీరింగ్, కోర్స్ చేశాడు. సంగీతం నేర్చుకుంటూనే డిగ్రీ పూర్తి చేశాడు.