https://oktelugu.com/

Rajinikanth Temple: 250 కిలోల విగ్రహం.. రజినీకాంత్ కు గుడికట్టిన ఈ అభిమాని.. ఇంతకీ ఎక్కడో తెలుసా?

గతంలో కుష్బూ, నయనతార, సమంత, నీతి అగర్వాల్ వంటి హీరోయిన్లకు అభిమానులు గుడి కట్టి పూజించారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ ఒకరు ఆయనకు గుడి కట్టాడు. నిత్య పూజలు చేస్తున్నాడు.

Written By:
  • Dharma
  • , Updated On : October 27, 2023 / 11:29 AM IST

    Rajinikanth Temple

    Follow us on

    Rajinikanth Temple: తాము అభిమానించే హీరో కోసం ఫ్యాన్స్ తపన పడుతుంటారు. వాళ్ల సినిమాలను ఎగబడి చూస్తారు. వారి పుట్టినరోజులు నాడు సేవా కార్యక్రమాలు చేపడతారు. సినీ అభిమానంలో ఇదో భాగమే. కానీ కొందరు తాము అభిమానించే హీరోలు, హీరోయిన్లను ఆరాధ్య దైవంగా భావిస్తారు. తాము భక్తులుగా మారిపోతారు. తమ అభిమాన హీరోకి గుడి కట్టి పూజలు చేస్తారు. గతంలో చాలామంది హీరో, హీరోయిన్ల విషయంలో ఇదే జరిగింది. ఇటువంటి ఘటనే ఒకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    గతంలో కుష్బూ, నయనతార, సమంత, నీతి అగర్వాల్ వంటి హీరోయిన్లకు అభిమానులు గుడి కట్టి పూజించారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ ఒకరు ఆయనకు గుడి కట్టాడు. నిత్య పూజలు చేస్తున్నాడు. మధురై కి చెందిన కార్తీక్ అనే వ్యక్తి రజనీకాంత్ కు వీరాభిమాని. రజనీ కోసం ఒక గుడి కట్టాడు. 250 కిలోల విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. విగ్రహం కింద తన తల్లిదండ్రుల ఫోటో, గణేశుని చిత్రం ఉంచాడు.

    ప్రతిరోజు ఆ విగ్రహానికి పూజలు చేయడం ఆనవాయితీగా మార్చుకున్నాడు. తనకు రజినీకాంత్ అంటే దేవుడితో సమానమని.. తాను రజిని భక్తుడిని అని చెప్పుకోవడానికి సగర్వంగా ఉందని చెబుతున్నాడు. ఎంతటి అభిమాని ఉన్నాడని రజినీకాంత్ వరకు చేరిందో లేదో కానీ.. కార్తీక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. కాకా రజినీకాంత్ తన 170 వ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో అమితాబచ్చన్ సైతం నటిస్తున్నారు. సమ్మర్ లో సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది.