https://oktelugu.com/

బీజేపీ దృష్టిలో పవన్ ఒక డమ్మీనేనా?

ఏపీలో బీజేపీ ప్రధాన మిత్రపక్ష నేత పవన్ కళ్యాన్ కు మోడీ అపాయింట్ మెంట్ దక్కలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడమే ధ్యేయంగా ఢిల్లీ వెళ్లిన పవన్ కు రిక్తహస్తమే ఎదురైందన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. మోడీని కలిసే విశాఖ స్టీల్ ప్లాంట్ పై తేల్చుకుంటానని అనుకున్న పవన్ ను కలిసేందుకు మోడీ అంగీకరించలేదు. దీంతో అమిత్ షాతో భేటి అయ్యారు పవన్. కానీ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 14, 2021 2:55 pm
    Follow us on

    ఏపీలో బీజేపీ ప్రధాన మిత్రపక్ష నేత పవన్ కళ్యాన్ కు మోడీ అపాయింట్ మెంట్ దక్కలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడమే ధ్యేయంగా ఢిల్లీ వెళ్లిన పవన్ కు రిక్తహస్తమే ఎదురైందన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.

    ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. మోడీని కలిసే విశాఖ స్టీల్ ప్లాంట్ పై తేల్చుకుంటానని అనుకున్న పవన్ ను కలిసేందుకు మోడీ అంగీకరించలేదు. దీంతో అమిత్ షాతో భేటి అయ్యారు పవన్. కానీ అక్కడా హామీ లభించలేదు. దీంతో పవన్ పొడిచేస్తాడని.. ఆపేస్తాడని ఆశ పడ్డ జనసైనికులు, విశాఖ ఉక్కు ఉద్యమకారులకు నిరాశ ఎదురైంది.

    అయితే పవన్ కు మరో అవమానం ఏంటంటే.. ఏపీలోని పెద్ద సమస్యపై కలవడానికి అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వని మోడీ.. అదే ఏపీకి చెందిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు తన వ్యక్తిగత అజెండాపై కలవడానికి అడిగితే అపాయింట్ మెంట్ ఇవ్వడమే ఇక్కడ జనసైనికులకు మింగుడు పడని అంశంగా మారింది. రఘురామను కలిసిన మోడీ.. తన మిత్రపక్ష పార్టీ అధినేతను కలిసే తీరిక లేదా? అని జనసేన నేతలు రగిలిపోతున్నారు.

    పవన ను కలవడం మోడీకి ఇష్టం లేదా? లేదా పవన్ మోసుకొచ్చిన విశాఖ ప్లాంట్ హామీని నెరవేర్చడం మోడీకి ఇష్టం లేదా అన్నది ఇక్కడ చర్చనీయాంశమవుతోంది. పవన్ ఎన్నిసార్లు వెళ్లినా మోడీ మాత్రం పవన్ ను కలవకపోవడం జనసేనాని పరపతిని.. హోదాను అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.

    అయితే బీజేపీ ఎలాగూ విశాఖ ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. దీంతో అనవసరంగా పవన్ ను కలిసి ఆయనకు క్రెడిట్ ఇచ్చి బీజేపీ టార్గెట్ కావడం ఇష్టం లేకనే మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది.