https://oktelugu.com/

Bigg Boss 6 Telugu- Sri Satya: బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య గురించి ఈవిషయాలు మీకు తెలుసా..

Bigg Boss 6 Telugu- Sri Satya: బిస్ బాస్ 6లోకి 6వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీసత్య.బిగ్ బాస్ హౌస్ లోని 11 మంది ఫిమేల్ కంటెస్టెంట్లలో శ్రీసత్య ఒకరు. సీరియల్స్ చూసేవాళ్లకు ఈమెను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయవాడకు చెందిన శ్రీసత్య.. మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. 2015లో మిస్ విజయవాడగా టైటిల్ విజేతగా నిలిచింది. నేను శైలజ, ‘లవ్ స్కెచ్’, గోదారి నవ్వింది వంటి సినిమాల్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : September 17, 2022 / 01:54 PM IST
    Follow us on

    Bigg Boss 6 Telugu- Sri Satya: బిస్ బాస్ 6లోకి 6వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీసత్య.బిగ్ బాస్ హౌస్ లోని 11 మంది ఫిమేల్ కంటెస్టెంట్లలో శ్రీసత్య ఒకరు. సీరియల్స్ చూసేవాళ్లకు ఈమెను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయవాడకు చెందిన శ్రీసత్య.. మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. 2015లో మిస్ విజయవాడగా టైటిల్ విజేతగా నిలిచింది.

    Sri Satya

    నేను శైలజ, ‘లవ్ స్కెచ్’, గోదారి నవ్వింది వంటి సినిమాల్లో శ్రీసత్య నటించింది. ‘ముద్ద మందారం’ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

    Also Read: PM Modi: సైనికుడు కావాలనుకున్నా సాధ్యం కాలేదు.. నరేంద్రమోదీ ఆర్మీలో ఎందుకు చేరలేకపోయారో తెలుసా?

    . సింగర్ గానూ ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత టీవీ ఇండస్ట్రీలో పలు షోల్లో పాల్గొంది. అందం, అభినయం ఉన్న శ్రీసత్యకు జంక్ ఫుడ్ చాలా ఇష్టమని చెప్పడంతో బిగ్ బాస్ స్టేజీ మీదనే నాగార్జున పలు రకాల జంక్ ఫుడ్ ఆహారం తీసుకొచ్చి మరీ పెట్టించాడు. అవి తినేసి శ్రీసత్య బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిపోయింది..

    Sri Satya

    బిగ్ బాస్ హౌస్ లోనే అత్యంత అందమైన పిల్లగా శ్రీసత్య అందరినీ అలరిస్తోంది. ఎవరితోనూ మాట్లాడకుండా కామ్ గా.. కూల్ గా తన పనితాను చేసుకుంటోంది. గొడవలు పెట్టుకోవడం లేదు. ఇక తన జీవితంలో ఓసారి ఆత్మహత్యాయత్నం చేశానని.. డిప్రెషన్ తో చావు అంచుల వరకూ వెళ్లానని శ్రీసత్య బిగ్ బాస్ లో బ్యాక్ గ్రౌండ్ వివరించింది.

    Also Read: Bigg Boss 6 Telugu- Sri Satya: బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య గురించి ఈవిషయాలు మీకు తెలుసా..

    Tags