Naga Chaitanya and Sobhita : సినిమా ఇండస్ట్రీలో వెలుగొందాలంటే పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉండాలనేంత రేంజ్ లో స్టార్ హీరోలు వాళ్ళను వాళ్ళు ఎలివేట్ చేసుకుంటున్నారు. నిజానికి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉంటేనే ఇక్కడ స్టార్ హీరోలుగా ఎదుగుతారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే టాలెంట్ తో పాటు కొంతవరకు ఇండస్ట్రీలో సపోర్ట్ అయితే ఉండాలి. లేకపోతే మాత్రం ఇక్కడ ఒక ఫ్లాప్ వచ్చిందంటే మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు అంటూ కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ప్రస్తుతం ఆ ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగేశ్వరరావు తర్వాత నాగార్జున స్టార్ హీరోగా ఎదిగాడు. కానీ ఆ తర్వాత వచ్చిన హీరోలెవరు అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోలుగా ఎదగలేకపోవడం వాళ్ల బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా నాగచైతన్య రెండో పెళ్లిని చేసుకున్నాడు. ఇక గతంలో సమంతను పెళ్లి చేసుకొని డివోర్స్ తీసుకున్న నాగచైతన్య గత కొద్ది సంవత్సరాల నుంచి సింగిల్ గానే ఉంటున్నారు. ఇక హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ను రీసెంట్ గా పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే కొంతమంది దర్శకులు ఇప్పటికే నాగచైతన్య శోభితాను హీరో హీరోయిన్లుగా పెట్టి ఒక సినిమా తీయడానికి ప్రణాళికలు రూపొందించూకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికి నాగచైతన్య శోభితా కూడా అంగీకరించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే చూడాలని అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు. మరి పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటించే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఆ సినిమా ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయనే రేంజ్ లో ఊహగానాలైతే వ్యక్తమవుతున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకునే కెపాసిటీ ఉన్న నాగచైతన్య మాత్రం స్టార్ హీరోగా ఎదగలేకపోతున్నాడు. మరి శోభిత ధూళిపాళ్లతో చేసిన సినిమాతో ఆయన స్టార్ డమ్ ను అందుకొని ఇప్పుడున్న స్టార్ హీరోలతో పాటు సరి సమానమైన గుర్తింపును సంపాదించుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోలు రావడం కొంతవరకు తగ్గిపోయింది. మరి ఆ లోటు ను నాగచైతన్య తీరుస్తాడా లేదా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది…
ఇక ఇదిలా ఉంటే నాగార్జున ప్రస్తుతం రజినీకాంత్ తో చేస్తున్న కూలీ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఇక దాంతో పాటుగా తన వందో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకపోయినప్పటికి కొంతమంది దర్శకులు చెబుతున్న కథలను వింటున్నట్టుగా కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి…