https://oktelugu.com/

Sukumar : పవన్ కళ్యాణ్ సుకుమార్ కాంబోలో మిస్ అయిన సూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..?అది చేస్తే ఇండస్ట్రీ షేక్ అయ్యేదా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకులు చాలా మంది ఉన్నారు. ఆయన చేసిన ప్రతి సినిమా మీద చాలా ఎఫర్ట్స్ పెట్టి మరి మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు...

Written By:
  • Gopi
  • , Updated On : December 30, 2024 / 11:43 AM IST

    Sukumar

    Follow us on

    Sukumar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియాలో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు సైతం ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితమైన వారే కావడం విశేషం… ఇక ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు ఆసక్తి చూపించేవారు. కానీ ఆయనకున్న బిజీ వల్ల కొంతమంది దర్శకులతో సినిమాలు చేయడానికి అవకాశం దొరికేది కాదు. ఇక ఈ క్రమంలోనే సుకుమార్ కూడా పవన్ కళ్యాణ్ తో ఒక భారీ సినిమాని చేయడానికి ఆసక్తి చూపించాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అప్పుడు బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. నిజానికి సుకుమార్ పవన్ కళ్యాణ్ కోసం ఒక అదిరిపోయే కథను రాసుకున్నాడట. కానీ ఇప్పటివరకు ఆ సినిమాని ఎవరితో చేయలేదని ఒక సందర్భంలో సుకుమార్ తెలియజేయడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ చేస్తేనే ఆ సినిమాని అతనితో చేయాలని ఆయన నిశ్చయించుకున్నాడట.

    దానికి ఆయన తప్ప వేరే ఎవరు సెట్టివ్వరనే ఉద్దేశ్యంతో ఆ కథను తీసి పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న రోజుల్లో సుకుమార్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే సుకుమార్ తో సినిమా చేయాలంటే భారీగా డేట్స్ ని కేటాయించాల్సిన అవసరమైతే ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అటు పాలిటిక్స్ ఇటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్నాడు. కాబట్టి తన సినిమాల మీద ఎక్కువ రోజులు కేటాయించే అవకాశం అయితే లేదు. అందువల్లే ఆయన ఇప్పుడు సుకుమార్ తో సినిమా చేసే అవకాశం లేదు మొత్తానికైతే ఒక మంచి కాంబినేషన్ ని మనం మిస్ అయిపోయామనే చెప్పాలి.

    ఏది ఏమైనా కూడా సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియాలో తన సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. పుష్ప 2 సినిమాతో భారీ రికార్డులను కొల్లగొడుతున్న ఈ దర్శకుడు తన తదుపరి సినిమాలతో కూడా మరిన్ని విజయాలను అందుకొని తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది…

    మరి ఒకవేళ ఫ్యూచర్ లో కనక వీళ్ళ కాంబినేషన్ పాజిబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్ వర్కౌట్ అయితే కనక ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…