Anil Ravipudi Allu Arjun Movie story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లు చాలామంది ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ సక్సెస్ లు దక్కుతున్నాయి. వాళ్లు మాత్రమే స్టార్ హీరోలను డైరెక్షన్ చేసే స్థాయికి ఎదుగుతున్నారు. కారణం ఏదైనా కూడా కమర్షియల్ సినిమాని చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పననే చెప్పాలి. కానీ ఆ కమర్షియల్ సినిమాకి కొత్తదనాన్ని జోడించి చేస్తే మూవీ సూపర్ హిట్ అవుతుందంటూ సినిమా మేధావులు సైతం పలు సందర్భాల్లో వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు ఇప్పటివరకు చేసిన తొమ్మిది సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. ప్రస్తుతం తన పదోవ సినిమాని ఎవరితో చేయబోతున్నాడనే విషయం మీద సరైన క్లారిటీ అనేది ఇవ్వలేకపోతున్నాడు.
ఇక వీలైనంత తొందరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి అప్డేట్ ఇస్తానని రీసెంట్ గా అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు… గతంలో అనిల్ రావిపూడి అల్లు అర్జున్ కి ఒక కథనైతే వినిపించాడట. ఆ కథ అనిల్ రావిపూడి స్టైల్ లోనే ఉండటంతో అల్లు అర్జున్ ఆ కథ రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది…
ఇంతకీ ఆ కథ ఏంటి అంటే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సిస్టంకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లను ఎలా పట్టుకుంటాడు. వాళ్ళు చేసే అక్రమాలను ఎలా బయటపెడతాడు అనే ఒక లైన్ తో ఈ సినిమా కథ అయితే ఉందట. ఇక అప్పటికే అలాంటివి చాలా సినిమాలు వచ్చాయి. కాబట్టి అల్లు అర్జున్ ఆ సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట…
ఇక అనిల్ రావిపూడి సైతం పటాస్ సినిమాతో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ను చాలా బాగా ఎలివేట్ చేసి చూపించాడు. అయినప్పటికి అనిల్ రావిపూడి తో సినిమా చేయడానికి అల్లు అర్జున్ ఇంట్రెస్ట్ చూపించకపోవడం అనేది అప్పట్లో ఒక హాట్ టాపిగ్గా మారింది… ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. కాబట్టి ఆయన పాన్ ఇండియా మార్కెట్ ఉన్న అట్లీ, లోకేష్ కనకరాజు లాంటి డైరెక్టర్లతో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు…