https://oktelugu.com/

Nagarjuna : నాగార్జున 100 వ సినిమా కథ ఏంటో తెలుసా..?

ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

Written By:
  • Gopi
  • , Updated On : December 9, 2024 / 10:22 AM IST

    Nagarjuna

    Follow us on

    Nagarjuna : ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో వారసత్వ పరంగా ఎంట్రీ ఇచ్చిన హీరోలు కొంతమంది సక్సెస్ అవుతుంటే మరికొంతమంది మాత్రం ఫెయిల్యూర్ గా మిగిలిపోతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. తన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో విచిత్రమైన పాత్రలను పోషించిన నాగార్జున మరోసారి ప్రేక్షకులను అలరించే ప్రయత్నమైతే చేస్తున్నాడు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. శ్రీ నందమూరి తారక రామారావు తర్వాత అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి సేవలు అయితే అందించాడు. అలాగే ఆయన చేసిన సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించడమే కాకుండా చాలాకాలం నుంచి ప్రేక్షకులు వాళ్ల ఫ్యామిలీకి అభిమానులుగా మారడం లో ఆయన కీలక పాత్ర పోషించారు… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న అక్కినేని హీరోలు ఇకమీదట కూడా వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే నాగార్జున్ లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం భారీ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో ఇక మీదట కూడా అలాంటి సక్సెస్ లను అందుకొని ముందుకు సాగే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు తన వందో సినిమాకు సంబంధించిన కథ చర్చలను నడుపుతున్న నాగార్జున ఈ సినిమాలో స్టైలిష్ విలన్ గా కనిపించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అన్నీ ఓకేతైతే ఇప్పుడు చేయబోతున్న సినిమా మరొక ఎత్తుగా తెలవబోతుంది. ఇక గ్యాంగ్ స్టర్ సినిమాగా రూపొందబోతున్న ఈ సినిమా భారీ రేంజ్ లో ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

    మరి ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? కథను ఎవరు అందిస్తున్నారనే విషయాలను ఇంకా గోప్యంగానే ఉంచుతున్నప్పటికి నాగార్జున నటించబోయే క్యారెక్టర్ కి సంబంధించిన ఆర్కు ను మాత్రం ముందే సెట్ చేసి పెడుతున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక నాగార్జున ఒక గ్యాంగ్ స్టర్ గా కనిపించడమే కాకుండా ఇందులో తన పరిధికి మించి మరి యాక్టింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

    ఇక ఇప్పటికే ఆయన విక్రమ్ కే కుమార్, బెజవాడ ప్రసన్నకుమార్ లాంటి వాళ్లతో కొన్ని కథ చర్చలు నడుపుతున్నప్పటికి వాటికి సంబంధించిన విషయాలు మాత్రం ఒక కొలిక్కి రావడం లేదు అందుకే ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఒకవేళ అన్ని వర్కౌట్ అయితే మాత్రం తన వందో సినిమాని 2025 వ సంవత్సరంలో సెట్స్ మీదికి తీసుకెళ్లి సంవత్సరం చివర్లో రిలీజ్ చేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది…