https://oktelugu.com/

Pushpa 3 : పుష్ప 3 లో ఎంట్రీ ఇవ్వనున్న కొత్త క్యారెక్టర్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 9, 2024 / 10:27 AM IST

    Pushpa 3

    Follow us on

    Pushpa 3 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే ఆ సినిమాకు సంబంధించిన దర్శకుడు అన్ని క్రాఫ్ట్ ల నుంచి బెస్ట్ అవుట్ పుట్ ను తీసుకురావాల్సిన అవసరమైతే ఉంది…

    పుష్ప సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన అల్లు అర్జున్ ఇప్పుడు ‘పుష్ప2’ సినిమాతో మరోసారి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ బాక్సాఫీస్ ను ఊచ కోత కోస్తున్నాడు. ఇక ఇప్పటికే రికార్డుల మీద రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్న ఈ సినిమా తొందర్లోనే మరిన్ని రికార్డులను కూడా తుడిచి పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వడం అనేది అల్లు అర్జున్ అభిమానులకు సుకుమార్ అభిమానులకు చాలావరకు ఊరటను ఇచ్చింది. ఈ సినిమా మీద మొదటి నుంచి మంచి హైప్ అయితే ఉంది. మరి ఆ హైప్ కు తగ్గట్టుగానే సినిమాను రూపొందించారు. అలాగే ప్రమోషన్స్ ని కూడా భారీ రేంజ్ లో చేపట్టి మొత్తానికైతే పుష్ప 2 సినిమా భారీ విజయాన్ని సాధించే దిశగా ముందుకు తీసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 ఎండింగ్లో పుష్ప 3 ర్యాంపేజ్ కూడా ఉండబోతున్నట్టుగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మరీ సినిమా ఎప్పుడు ఉంటుంది అనే దానిమీద సరైన స్పష్టత అయితే లేదు. కానీ ఈ సినిమాలో ఒక కొత్త విలన్ ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే సుకుమార్ తనదైన మార్క్ మేకింగ్ ను చూపిస్తూ ఇండస్ట్రీకి ఒక సూపర్ సక్సెస్ ని అందించాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి పుష్ప 3 సినిమాలో రాబోతున్న విలన్ క్యారెక్టర్ ఎవరు అనే దానిమీద స్పష్టత అయితే లేదు.

    కానీ హాలీవుడ్ నుంచి ఒక విలన్ ను తీసుకొచ్చి ఇందులో భాగం చేయాలనే ఉద్దేశ్యంతో సుకుమార్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ లోకి దూసుకస్తుంది…కాబట్టి అక్కడ కూడా మార్కెట్ అవ్వాలంటే వాళ్లకు తెలిసిన ఎవరో ఒక నటుడు ఈ సినిమాలో ఉండాలి.

    కాబట్టి ఒక హాలీవుడ్ నటుడిని కూడా ఈ సినిమాలో తీసుకోవాలనే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే ఈ సినిమాతో అల్లు అర్జున్ ఒక భారీ సక్సెస్ ని అందుకున్నాడనే చెప్పాలి.

    మరి ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుందాం… మరి ఇప్పటికే అల్లు అర్జున్ కి అల్లు ఆర్మీ అంటు ఒక పెద్ద ఫ్యాన్ బేస్ అయితే ఉంది. కాబట్టి పాన్ వరల్డ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తే అక్కడ కూడా భారీ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…