Tabu: ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన టబూ చాలా సంవత్సరాల పాటు తెలుగు ఇండస్ట్రీలో తనదైన మార్క్ చూపిస్తూ నటి గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ క్రమంలోనే ఆమె తెలుగులో స్టార్ హీరోలందరితో నటించింది. నాగార్జునతో ఎక్కువగా సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకుంది. దాంతో వీళ్లిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ అప్పట్లో మీడియా కొన్ని కథనాలు కూడా సృష్టించింది.
ఇక జనాలు కూడా వాళ్ల మధ్య ఏదో జరుగుతుంది అంటూ మాట్లాడుకున్నారు. కట్ చేస్తే ఆమె ఇప్పటివరకు కూడా పెళ్లి చేసుకోలేదు. 50 సంవత్సరాల వయసు దాటినా కూడా తను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం నాగార్జున అని కొంతమంది సినీ విమర్శకులు సైతం నాగార్జున మీద కొన్ని విమర్శలు అయితే చేశారు. అయినప్పటికీ రీసెంట్ గా టబు తన పెళ్లి మీద స్పందిస్తూ నేను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం నాకు ఇండివిడ్యుయల్ గా ఉండడం ఇష్టం. అందువల్లే తను పెళ్లి చేసుకోలేదనే క్లారిటీ ఇచ్చింది. ఇక దీంతో చాలా రోజుల నుంచి టబ్ పెళ్లి మ్యాటర్ మీద వస్తున్న చాలా వార్తలు కల్పిత కథలే అనే విషయం చాలా క్లారిటీగా తెలిసిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి సినిమాలను చేస్తూ నటిగా తనకొక ప్రత్యేక ఇమేజ్ అయితే ఏర్పాటు చేసుకుంది.
ఇక ఈ ఏజ్ లో కూడా తన ఏజ్ కి తగ్గ పాత్రలు చేస్తూ నేషనల్ అవార్డులను సైతం కొల్లగొడుతుంది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అలా వైకుంఠపురం లో సినిమాలో అల్లు అర్జున్ కు అమ్మ గా నటించి తెలుగులో కూడా మంచి ఆదరణని పొందారు.
తన ఇమేజ్ కి తగ్గ పాత్ర దొరికితే తను ఏ లాంగ్వేజ్ లో అయినా నటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఇప్పటికి తను చాలాసార్లు చెప్పింది. ఇక అలా వైకుంఠపురం లో సినిమా తర్వాత తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలైతే రాలేదు. ఇక ముందు కూడా తెలుగు చాలా మంచి సినిమాలతో రాబోతున్నట్టు గా తెలుస్తుంది…