https://oktelugu.com/

Chiranjeevi: డైరెక్టర్ తేజ చెప్పిన కథకు ఫిదా అయిన చిరంజీవి… మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?

చిరంజీవి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది. రొమాన్స్, సాంగ్స్, ఫైట్స్ లాంటి సినిమాలు పక్కన పెట్టి సరికొత్త కాన్సెప్ట్ లకు పెద్దపీఠ వెస్తున్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : January 27, 2024 / 08:31 AM IST
    Follow us on

    Chiranjeevi: ప్రస్తుతం చిరంజీవి తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక రీసెంట్ గా చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం ‘పద్మ విభూషణ్’ పురస్కారంతో సత్కరించింది. దాంతో చిరంజీవి చాలా హ్యాపీ గా ఉన్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా గా ఉన్నాడు. ఇక ఇప్పుడు చిరు తో సినిమా చేయడానికి చాలా మంది డైరెక్టర్లు పోటీ పడుతున్నారు. ఇక ఇప్పటికే నెల్సన్, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, మారుతి లాంటి దర్శకులు చిరంజీవి లిస్టులో ఉండగా, ఇక ఇప్పుడు డైరెక్టర్ తేజ కూడా చిరంజీవి కి ఒక సబ్జెక్టు వినిపించినట్టుగా తెలుస్తుంది.

    అయితే ఇంతవరకు ఎప్పుడు పెద్ద హీరోలతో సినిమాలు చేయని తేజ మంచి సబ్జెక్టు దొరికితే తప్పకుండా పెద్ద హీరోలతో సినిమా చేస్తాను అని ఇంతకుముందు చాలా సార్లు ప్రకటించాడు. ఇక ఇదే రీతిలో ఇప్పుడు చిరంజీవికి తను ఒక లైన్ చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే రానాతో ‘రాక్షస రాజా’ అనే సినిమా చేస్తున్న తేజ ఇప్పుడు చిరంజీవితో సినిమా చేయడానికి కూడా సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే చిరంజీవి ఆయన చెప్పిన లైన్ విని ఎగ్జైట్ అయినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఫుల్ స్టోరీ రెడీ చేసిన తర్వాత తన ఒపీనియన్ ని చెప్తానని చిరు చెప్పినట్టు గా తెలుస్తుంది.

    అయితే ఇప్పుడున్న దర్శకులు అందరూ హీరోయిన్, సాంగ్స్, ఫైట్స్ లాంటి రొటీన్ కాన్సెప్ట్ స్టోరీతో వస్తున్నారని కానీ తేజ చెప్పిన పాయింట్ చాలా వెరైటీగా ఉండటంతో చిరంజీవి కి బాగా నచ్చిందని అందువల్లే తేజ మీద చిరంజీవి ఎక్కువ ఇంట్రెస్ట్ తో చూపిస్తున్నట్టు గా తెలుస్తుంది. మరి తేజ ఫుల్ స్టోరీ తో చిరంజీవిని మెప్పిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

    ఇక ఇప్పుడు చిరంజీవి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది. రొమాన్స్, సాంగ్స్, ఫైట్స్ లాంటి సినిమాలు పక్కన పెట్టి సరికొత్త కాన్సెప్ట్ లకు పెద్దపీఠ వెస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక తేజ చెప్పిన స్టోరీ పర్ఫెక్ట్ గా చిరంజీవి కి యాప్ట్ అవుతుందనే వార్తలైతే వస్తున్నాయి. అయితే ఈ స్టోరీ 1980 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక పూర్తి స్టోరీ తో తేజ చిరంజీవి ని మెప్పిస్తే ఆయన నక్క తోక తొక్కినట్టే అని సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…