Niharika Konidela: చైతన్య తో విడాకుల మీద స్పందించిన నిహారిక…

మెగా డాటర్ అయిన నిహారిక పరిస్థితి ఇలాగే ఉంది. నాగబాబు కూతురు గా అందరికీ సుపరిచితం అయిన నిహారిక గత రెండు సంవత్సరాల క్రితం చైతన్య అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది.

Written By: Gopi, Updated On : January 27, 2024 8:20 am
Follow us on

Niharika Konidela: పెళ్లి బంధాన్ని భారతదేశం లో చాలా పవిత్రంగా చూస్తారు. ఈ రోజుల్లో చాలామంది పెళ్లి చేసుకొని కొద్దిరోజులు కలిసి ఉండి ఇద్దరి మధ్య విభేదాలు రావడం తో మధ్యలోనే విడాకులు తీసుకుంటున్నారు. అయితే ఇది నార్మల్ జనాలు చేస్తే ఎవరు పట్టించుకోరు కానీ సెలబ్రిటీల ఫ్యామిలీ లలో ఇలా జరిగితే మాత్రం ఇది చాలా పెద్ద న్యూస్ గా మారుతుంది.

ఇక ప్రస్తుతం మెగా డాటర్ అయిన నిహారిక పరిస్థితి ఇలాగే ఉంది. నాగబాబు కూతురు గా అందరికీ సుపరిచితం అయిన నిహారిక గత రెండు సంవత్సరాల క్రితం చైతన్య అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఇది పెద్దలు కూర్చిన సంబంధం అయినప్పటికి ఇద్దరు కూడా పెళ్లి కి అంగీకరించారు. అలాగే పెళ్లి చేసుకున్నాక కూడా ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకుంటు, కొద్ది రోజుల పాటు బాగానే ఉన్నప్పటికీ మధ్య లో జరిగిన కొన్ని ఇష్యూస్ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచడం తో కలిసి బతకలేక డివోర్స్ తీసుకున్నారు.

ఇక ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక చైతన్యతో విడాకుల గురించి మాట్లాడుతూ ‘జీవితాంతం కలిసి ఉంటామనే ఉద్దేశ్యం తోనే పెళ్లి చేసుకున్నాం, కానీ మధ్యలో కొన్ని కారణాలవల్ల విడిపోవలసి వచ్చింది’ అంటూ చెప్పింది. అలాగే తన విడాకులు తీసుకోవడం మీద చాలా మంది ఆన్లైన్ లో ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేశారు అవి చూసి చాలాసార్లు బాధపడ్డాను, అలాగే కొన్ని సార్లు కన్నీళ్లు కూడా పెట్టుకున్నాను. కానీ అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మా నాన్న నాకు తోడుగా ఉన్నాడు అంటూ తను చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం నిహారిక ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి తన కెరియర్ పైన దృష్టి పెట్టింది. విడాకులు తీసుకున్న బాధ నుంచి తనని తాను డైవర్ట్ చేసుకోవడానికే తన చేత నాగబాబు ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టించి తనని వర్క్ లో ఇన్వాల్వ్ చేసినట్టుగా కూడా చాలా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇది ఇలా ఉంటే ఇంతకు ముందు నిహారిక కొన్ని సినిమాల్లో యాక్టింగ్ కూడా చేసింది. ఇక ప్రస్తుతం ఆమె మళ్ళీ యాక్టింగ్ మీద కూడా ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆమె తన కెరీర్ ని సెట్ చేసుకున్న తర్వాతే ఇంకో పెళ్లి గురించి ఆలోచించే అవకాశాలు ఉన్నట్టు గా తెలుస్తుంది.