Homeఎంటర్టైన్మెంట్Prashanth Neel: ప్రశాంత్ నీల్ పాన్ ఇండియాలో టాప్ డైరెక్టర్ గా ఎదగడానికి కారణం ఏంటో...

Prashanth Neel: ప్రశాంత్ నీల్ పాన్ ఇండియాలో టాప్ డైరెక్టర్ గా ఎదగడానికి కారణం ఏంటో తెలుసా..?

Prashanth Neel: సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే చాలా మంచి క్రేజ్ అయితే ఏర్పడుతుంది. అయితే వాళ్ళు చేసిన సినిమాల ద్వారా గాని, వాళ్లు సాధించే సక్సెస్ ల ద్వారా గాని వాళ్ళకున్న ఈ క్రేజ్ అనేది జనాల్లో విపరీతమైన ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది…లైమ్ లైట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం స్టార్ హీరోలు సైతం పోటీ పడుతూ ఉంటారు. వాళ్లతో సినిమాలు చేయడం వల్ల వీళ్ళ క్రేజ్ పెరగడమే కాకుండా మార్కెట్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. అందువల్లే స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఎప్పుడు ఆసక్తి చూపిస్తారు. ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకుల హవా నడుస్తుంది అందులో ప్రశాంత్ నీలో ఒకరు. ఇక ఈ దర్శకుడు తో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. రీసెంట్ గా ఈయన తమిళ్ స్టార్ హీరో అజిత్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలైతే వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదనే విషయం అయితే చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టును చేతిలో పట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అజిత్ తో సినిమా చేసే టైం అతనికి లేదు. కాబట్టి ఇప్పుడప్పుడే అజిత్ తో సినిమా చేసే అవకాశాలు అయితే లేవు.

ప్రస్తుతం ఆయన ముందు ఉన్న టార్గెట్ ఏంటి అంటే ఆయన చేయబోయే ‘సలార్ 2’ సినిమాతో భారీ సక్సెస్ ను కొట్టడమే.. ఇక ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో మరొక భారీ సినిమా చేసి సూపర్ సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. దానికోసమే విపరీతమైన ప్రయత్నం చేస్తున్నాడు. గత సంవత్సరం వచ్చిన సలార్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన ఇప్పుడు మరోసారి భారీ సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే సలార్ 2 సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ హీరోలందరు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక మిగతా డైరెక్టర్ల కంటే కూడా ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఆయన యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ గా సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకుడి చేత విజిల్స్ కొట్టించేలా సినిమాని తీస్తూ ఉంటాడు. అందువల్లే ఆయనతో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ముందుగానే స్టార్ హీరోలందరు అతనితో సినిమా చేయడానికి కమిట్ అవుతున్నారు.

ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ దాదాపు ఒక నాలుగైదు సంవత్సరాల వరకు చాలా బిజీగా ఉండనున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ప్రశాంత్ నీల్ తనదైన రీతిలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ముందుకు సాగుతున్నాడు. ఇక ఇండియాలో రాజమౌళి తర్వాత అంతటి భారీ గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ కావడం విశేషం…రాజమౌళి లాగే తను కూడా యాక్షన్ ఎంటర్ టైనర్లను చేస్తూ సక్సెస్ లను అందుకుంటున్నాడు…
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇండియాలో రాజమౌళి తర్వాత ప్రశాంత్ నీల్ టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు అనేది వాస్తవం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version