Homeఎంటర్టైన్మెంట్Varanasi Movie: 'వారణాసి' తరువాత మహేష్ బాబు తో సినిమా చేసే లిస్ట్ లో ఉన్న...

Varanasi Movie: ‘వారణాసి’ తరువాత మహేష్ బాబు తో సినిమా చేసే లిస్ట్ లో ఉన్న దర్శకులు వీళ్లే…

Varanasi Movie: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు… చాలా తక్కువ సమయంలోనే ఆయన స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ‘ వారణాసి ‘ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం అలరించడానికి సిద్ధమవుతున్నాడు. రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న ఈ సినిమా విషయంలో ప్రతి ఒక్కరికి చాలా అంచనాలైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని చాలా రిచ్ గా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. విజువల్ వండర్ గా ఉండే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. 1500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లాంగ్ రన్ లో 3500 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలో రాజమౌళి ఉన్నాడు. మరి అతను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రేంజ్ మారిపోతుంది. కాబట్టి ఆయన ఎవరితో సినిమా చేస్తే బాగుంటుంది అనే ధోరణిలోనే కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే మహేష్ బాబు కొంతమంది దర్శకులతో కథా చర్చలు జరుపుతున్నాడు. సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులు మహేష్ కి కథలను వినిపిస్తున్నప్పటికి ఆయన మాత్రం సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు సుకుమార్ తో మహేష్ బాబు వన్ నేనొక్కడినే అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో వైవిధ్యాన్ని కనబరిచినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్నైతే సాధించలేదు.

ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రావాల్సి ఉన్నప్పటికి అది పట్టాలెక్కలేదు. దాంతో ఎలాగైనా సరే సుకుమార్ తో ఒక సక్సెస్ ఫుల్ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే సుకుమార్ మహేష్ బాబు కాంబినేషన్ సెట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version