https://oktelugu.com/

Chiranjeevi: చిరంజీవి కథల విషయం లో చాలా క్లారిటీ గా ఉన్నాడు…తప్పంతా వాళ్ళదే…

చిరంజీవి పేరు చెబితే మనందరికీ మొదట ఆయన పడిన కష్టం గుర్తుకు వస్తుంది. ఆయన మెగాస్టార్ గా మారడానికి సినిమాలా మీద కేటాయించిన సమయం, ఆయన ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు ఇవన్నీ మన ముందు కదలాడుతుంటాయి...

Written By:
  • Gopi
  • , Updated On : July 26, 2024 / 03:31 PM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా ఇండస్ట్రీ లో ఉన్నన్ని రోజులు ఆయన పేరు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఒక్కడిగా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక్కడు చిరంజీవి…ఇక ఇప్పటికి కూడా ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆయన చేసే ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను తన అభిమానులను దృష్టిలో ఉంచుకొని ఎవరిని నిరాశపరచకూడదనే ఉద్దేశ్యం తోనే కథను రెడీ చేయించుకొని సినిమాగా చేస్తూ ఉంటాడు. నిజానికి చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి విపరీతమైన ఇష్టం ఉంటుంది. ఏ హీరో అభిమాని అయిన కూడా చిరంజీవి వ్యక్తిత్వానికి గాని, ఆయన నటనకు గాని అభిమానులుగా మారక తప్పదు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మరికొంతమంది డైరెక్టర్లతో సినిమా చేయడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నాడు. అయితే చిరంజీవి సినిమా సెలెక్షన్ లో చాలావరకు రాంగ్ డిసీజన్స్ తీసుకుంటున్నాడు అంటూ చాలామంది విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా చిరంజీవి కమర్షియల్ సినిమాలు చేయడం అవసరమా? ఇప్పటికైనా ప్రయోత్మకమైన సినిమాలు చేయొచ్చు కదా అంటూ విపరీతమైన కామెంట్లైతే చేస్తున్నారు.

    నిజానికి వాళ్ళందరూ చెప్పింది కరెక్టే చిరంజీవి ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేయొచ్చు…ఇక ఆయన కూడా ఎప్పుడు నేను ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేయను అని చెప్పలేదు. ఒక కొత్త సబ్జెక్టు తన దగ్గరికి వస్తే సినిమా చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఆయన చేసిన సినిమాలు ఏవి కూడా ఆశించిన విజయాన్ని అందించలేదు. ఆయన అలాంటి సినిమాలను చేయకుండా కమర్షియల్ సినిమాలైతే సగటు ప్రేక్షకుడికి నచ్చే విధంగా ఉంటాయి. అలాగే ప్రొడ్యూసర్ కూడా సేఫ్ జోన్ లో ఉంటాడనే ఉద్దేశ్యంతోనే ఆయన కమర్షియల్ సినిమాలను చేస్తున్నాడు.

    నిజానికి ఆయన కెరియర్లో ఆపద్బాంధవుడు,రుద్రవీణ, మృగరాజు, డాడీ లాంటి సినిమాలు అయాన్ ఇమేజ్ కి తగ్గ సినిమాలు కాదు. అయిన కూడా రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ సినిమాలను చేశాడు. దీనివల్ల చిరంజీవికి ఇమేజ్ పరంగా కొంతవరకు డ్యామేజ్ అయితే ప్రొడ్యూసర్స్ మాత్రం చాలా వరకు నష్టపోయారు. ఇక వేరే హీరోలు ప్రయోగాత్మకమైన సినిమాలు చేసినా కూడా అది చాలా తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది. కానీ చిరంజీవి ఒక ప్రయోగాత్మకమైన సినిమా చేయాలంటే దానికి బడ్జెట్ కూడా చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఇక ఈ సమయంలో ఆ సినిమాలు ప్రేక్షకుడిని మెప్పించలేకపోతే ఆయన ఇమేజ్ తగ్గడం ఒకటైతే ప్రొడ్యూసర్లు విపరీతమైన నష్టాలకు గురవాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతుంది.

    కాబట్టి ప్రొడ్యూసర్స్ ని సేఫ్ జోన్ లో ఉంచడానికి తన అభిమానులను ఎంకరేజ్ చేసే విధంగానే ఆయన కమర్షియల్ సినిమాలకు మాత్రమే స్టిక్ అయిపోయి అవే సినిమాలు చేస్తున్నాడు. ఇక దీంట్లో చిరంజీవి తప్పు ఏమీ లేదు. చిరంజీవి డిఫరెంట్ సినిమాలు చేస్తే ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేయడం లేదు. అందుకే ఆయన ప్రయోగాలకు చాలా దూరంగా ఉంటూ వస్తున్నాడు అంటూ కొంతమంది సినీ మేధావులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…