Salaar 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలవించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నింటి విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉంటున్నాడు. ఈ సంవత్సరం వచ్చిన రాజాసాబ్ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట కట్టుకున్న ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమాను డిసెంబర్ 3వ తేదీన ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అది అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. దాంతో పాటుగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసి ప్రేక్షకులందరికి షాక్ ఇచ్చారు.
ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ గాని, టీజర్ గాని రిలీజ్ చేయలేదు. అయినప్పటికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం పట్ల పలువురు సినిమా మేధావులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ప్రభాస్ ఈ సంవత్సరం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం…
ఇక ఇదిలా ఉంటే ‘స్పిరిట్’ సినిమా తర్వాత ప్రభాస్ ‘కల్కి 2’ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. తర్వాత ‘సలార్ 2’ సినిమా చేయబోతున్నట్టుగా గతంలో క్లారిటి ఇచ్చాడు. ఇక ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని డిఫరెంట్ యాంగిల్ లో చూపించబోతున్నారట. తనలోని పూర్తిస్థాయి నటుడిని బయటికి తీయడమే కాకుండా తనకు లేడీ గెటప్ వేయించి ఒక జాతర ఎపిసోడ్ ని కూడా డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ గంగాలమ్మ జాతరలో చీర కట్టుకొని ఫైట్ చేసిన సన్నివేశాలు ప్రేక్షకుల కళ్ళల్లో ఇప్పటికి అలాగే మెదులుతున్నాయి. ఇక అల్లు అర్జున్ బాటలోనే ప్రభాస్ ను కూడా నడిపిస్తూ అతని చేత చీర కట్టిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రభాస్ చీర కడితే ఏ రేంజ్ లో ఉంటుంది. తను ఏది చేసినా అద్భుతంగా భావించే అభిమానులు దీన్ని ఎలా స్వీకరిస్తారు అనేది తెలియాల్సి ఉంది…
