https://oktelugu.com/

Nagarjuna: నాగార్జున తన సినిమాల్లో సౌందర్య, రమ్యకృష్ణ లను ఎక్కువగా రిపీట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా..?

ఏ జానర్లో అయిన సినిమాలు చేసి మెప్పించగలిగే సత్తా ఉన్నటువంటి నటులలో నాగార్జున కూడా ఒకరు కావడం విశేషం...ప్రస్తుతం ఆయన వరుస సినిమాలని చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : April 3, 2024 / 01:43 PM IST

    Nagarjuna, Soundarya, Ramya Krishna

    Follow us on

    Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడి గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఇప్పుడు తనదైన రీతిలో వరుసగా సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక నాగార్జున పేరు చెబితే ఇప్పటికీ చాలామందికి శివ, గీతాంజలి సినిమాలు గుర్తుకొస్తాయి. అయితే ఈ రెండు సినిమాలు అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించాయనే చెప్పాలి. ఒకటి మాస్ యాక్షన్ సినిమా కాగా, మరొకటి రొమాంటిక్ లవ్ స్టోరీ కావడం విశేషం..

    ఇక ఏ జానర్లో అయిన సినిమాలు చేసి మెప్పించగలిగే సత్తా ఉన్నటువంటి నటులలో నాగార్జున కూడా ఒకరు కావడం విశేషం…ప్రస్తుతం ఆయన వరుస సినిమాలని చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక దానికి సంబంధించిన కథలను కూడా వింటూ దర్శకులను ఎంపిక చేసే పని లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే నాగార్జున ఒకప్పుడు సౌందర్య, రమ్యకృష్ణ లాంటి హీరోయిన్లతో ఎక్కువగా సినిమాలు చేశాడు. ఇక మీనా, రంభ లాంటి హీరోయిన్లు ఉన్నప్పటికీ వాళ్ళని తన సినిమాలో ఎక్కువగా రిపీట్ చేయలేదు.

    ఒకటి రెండు సినిమాలకు మాత్రమే పరిమితం చేసి సౌందర్య, రమ్యకృష్ణతో మాత్రమే తను ఎక్కువగా సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే రీసెంట్ గా నాగార్జునని ఒక ఇంటర్వ్యూలో ఈ విషయానికి సంబంధించిన క్వశ్చన్ అడగగా ఆయన దానికి సమాధానం చెబుతూ నాతో సినిమా చేసే దర్శకులు సౌందర్య, రమ్యకృష్ణ లా పేర్లను నా దగ్గర ఎక్కువగా ప్రస్తావించేవారు. అందుకే వారిని తన సినిమాలో ఎక్కువగా రిపీట్ చేస్తూ వచ్చాను. మా కాంబినేషన్స్ కి మంచి గుర్తింపు ఉంది. అలాగే మా మధ కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయ్యేదనే ఉద్దేశ్యం తో దర్శకులు ఆ హీరోయిన్లతోనే సినిమాలు చేయాలని అనుకున్నారు.

    అందువల్లే వాళ్ళ నిర్ణయానికి తలవంచి నేను ఆ హీరోయిన్ల తోనే ఎక్కువగా సినిమాలు చేయాల్సి వచ్చింది. అలాగే మా కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ అవడం ప్రేక్షకులు కూడా మా కాంబినేషన్ ను ఎక్కువగా కోరుకోవడం తో నేను కాదనలేకపోయాను. ఇక అయినప్పటికీ మిగతా హీరోయిన్లతో కూడా సినిమాలు చేస్తూ వచ్చాను అని నాగార్జున చెప్పడం విశేషం…