https://oktelugu.com/

Nagarjuna: నాగార్జున కి ఆ సినిమాతో జ్ఞానోదయం అయిందా..? అందుకే మరోసారి అలాంటి తప్పు చేయట్లేదా..?

ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కి, భారీ డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ సినిమా కనక సూపర్ డూపర్ సక్సెస్ అయినట్టైతే పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్న మొదటి హీరో నాగార్జున అయ్యేవాడు.

Written By:
  • Gopi
  • , Updated On : March 20, 2024 / 12:54 PM IST

    Nagarjuna get enlightened with Rakshakudu Movie

    Follow us on

    Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కింగ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నాగార్జున తన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించాడు. ఇక ప్రస్తుతం తన 100 వ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఒకానొక టైమ్ లో నాగార్జున పాన్ ఇండియా సినిమా కూడా చేశాడనే విషయం మనలో చాలా మందికి తెలియదు.

    ఆ సినిమా ఏంటంటే ‘రక్షకుడు’… ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కి, భారీ డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ సినిమా కనక సూపర్ డూపర్ సక్సెస్ అయినట్టైతే పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్న మొదటి హీరో నాగార్జున అయ్యేవాడు. ఇక ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ అనేది భారీగా ఉండడంతో అప్పట్లో ప్రొడ్యూసర్ ఈ సినిమా వల్ల విపరీతంగా నష్టపోయాడు. ఇక అప్పటినుంచి నాగార్జున భారీ బడ్జెట్ సినిమాలను చేయకూడదని ఒక రూల్ పెట్టుకొని ఇప్పటివరకు అదే రూల్ ను ఫాలో అవుతూ వస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయన ఏ సినిమా స్టోరీ విన్నా కూడా బడ్జెట్ ని వీలైనంతవరకు తగ్గించే ప్రయత్నం అయితే చేస్తాడు. ఎందుకంటే ప్రొడ్యూసర్ సేఫ్ గా ఉంటేనే మనం కూడా సేఫ్ గా ఉంటామని ఆలోచించే వ్యక్తి కాబట్టి నాగార్జున ముందు ప్రొడ్యూసర్ సేఫ్టీ గురించి ఆలోచిస్తాడు. ఇక అందులో భాగంగానే తక్కువ బడ్జెట్ లో సినిమాలని చేయడానికి ఆయన ఎక్కువగా ఉత్సాహాన్ని చూపిస్తాడు. ఒకవేళ సినిమా ప్లాప్ అయిన కూడా ప్రొడ్యూసర్ కి అంతగా నష్టలైతే రావు కాబట్టి ఆ వచ్చిన నష్టాన్ని ఈజీగా రికవరీ చేసుకోవచ్చనే ఉద్దేశ్యంతో అలా చేస్తాడు. ఇక మొత్తానికైతే రక్షకుడు సినిమా వల్ల నాగార్జున ఒక పెద్ద పాఠాన్ని నేర్చుకున్నాడనే చెప్పాలి. ఇక ప్రస్తుతం నాగార్జున తన వందోవ సినిమా ఏ డైరెక్టర్ తో చేయాలి అనే నిర్ణయంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికి సంబంధించి కథలను కూడా వింటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక కొంత మంది డైరెక్టర్లను ఫైనలైజ్ చేసినప్పటికీ అందులో ఎవరితో సినిమా చేయాలి అనేదాంట్లో ఇంకా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అయితే కనిపించడం లేదు…