Site icon OkTelugu

Mana Shankara Varaprasad Garu gross: తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’, ‘ఓజీ’ గ్రాస్ లను దాటేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’..ఎంత వచ్చిందంటే!

Mana Shankar Varaprasad Garu box office

Mana Shankar Varaprasad Garu box office

Mana Shankara Varaprasad Garu gross: ఈ సంక్రాంతికి అత్యధిక వసూళ్లను రాబట్టడమే కాకుండా, ప్రాంతీయ బాషా చిత్రాల్లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రానికి ఓటీటీ విడుదల తేదీని ప్రకటించినప్పటికీ కూడా, థియేటర్స్ లో ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవుతూనే ఉన్నాయి. రెండు మూడు వారాలకే థియేట్రికల్ రన్ ఆగిపోతున్న ఈరోజుల్లో, సుమారుగా నెల రోజుల పాటు థియేటర్స్ నుండి షేర్ వసూళ్లను రాబడుతూ ముందుకు వెళ్లడం అనేది సాధారణమైన విషయం కాదు. ఈ నెల 16వ తేదీ వరకు, అనగా శివరాత్రి వరకు ఈ చిత్రానికి థియేటర్స్ నుండి షేర్ వసూళ్లు వస్తూనే ఉంటాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం పాన్ ఇండియన్ సినిమాల ఫుల్ రన్ రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టేసిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే గత ఏడాది విడుదలైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి సుమారుగా 213 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా 2024 వ సంవత్సరం లో దసరా కానుకగా విడుదలైన ‘దేవర’ చిత్రం 221 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను తెలుగు రాష్ట్రాల నుండి రాబట్టింది. ఈ రెండు రికార్డ్స్ ని ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం, నాలుగు సినిమాలతో పోటీ పడి మరీ దాటేసింది. చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి విషయం లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ చిత్రం విషయం లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి నాలుగు వారాలకు కలిపి 229 కోట్ల రూపాయిలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఫుల్ రన్ పూర్తి అయ్యేసరికి 240 కోట్ల గ్రాస్ కి దగ్గరగా కూడా వెళ్లొచ్చట ఈ చిత్రం.

అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఓజీ’, ‘దేవర’ లాంటి సినిమాలను కూడా మెగాస్టార్ అవలీలగా దాటేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సరైన టాక్ వస్తే మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ విద్వంసం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి ఈ చిత్రం మరో ఉదాహరణగా నిల్చింది. నిన్న కూడా ఈ చిత్రం అనేక ప్రాంతాల్లో హౌస్ ఫుల్ షోస్ ని నమోదు చేసుకుంది. బుక్ మై షో యాప్ లో దాదాపుగా 10 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. గడిచిన మూడేళ్ళలో ఇలాంటి లాంగ్ రన్ ఉన్న సినిమాని చూడలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. భవిష్యత్తులో అయినా చూడగలమో లేదో చూడాలి.

Exit mobile version