https://oktelugu.com/

Radhika Apte: రాధిక ఆప్టే తెలుగు సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటంటే..?

బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన 'లెజెండ్ ' సినిమాలో హీరోయిన్ గా చేసి తను మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఈ సినిమా ఇచ్చిన బూస్టప్ తో ఆమె వరుసగా తెలుగు సినిమాల్లో నటించడానికి సిద్ధమైంది.

Written By:
  • Gopi
  • , Updated On : April 3, 2024 / 01:48 PM IST

    Why Radhika Apte not doing Telugu films

    Follow us on

    Radhika Apte: తెలుగులో రక్త చరిత్ర సినిమాతో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి రాధిక ఆప్టే… అయితే ఈ సినిమాలో తను పోషించిన పాత్ర అనే కి మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఇక దాంతో ఆమెకు తెలుగులో మంచి అవకాశాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘లెజెండ్ ‘ సినిమాలో హీరోయిన్ గా చేసి తను మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఈ సినిమా ఇచ్చిన బూస్టప్ తో ఆమె వరుసగా తెలుగు సినిమాల్లో నటించడానికి సిద్ధమైంది.

    అయినప్పటికీ ఈ సినిమా తర్వాత ఆమె చేసిన సినిమాలేవి కూడా పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో ఆమె తెలుగులో అవకాశాలను అందుకోలేకపోయింది. ఇక దాంతోపాటుగా ఆమెకి తెలుగులో ఉన్న కొంతమంది స్టార్ హీరోల బిహేవియర్స్ నచ్చలేదట. దానివల్లే ఆమె తెలుగులో అవకాశం వచ్చిన నటించనని చాలా ఓపెన్ గా స్టేట్మెంట్ అయితే ఇచ్చింది.

    అయితే ఆమె చేసిన హీరోల్లో కొంతమంది ఆమెతో మిస్ బిహేవ్ చేశారట. దానివల్లే తను చాలా అప్సెట్ అయినట్టుగా ఇక్కడ హీరోల డామినేషన్ ఎక్కువగా ఉంటుందని కూడా ఓపెన్ గా మాట్లాడడం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. ఇక మొత్తానికైతే రాధిక ఆప్టే మాట్లాడిన మాటలు అప్పట్లో తీవ్రమైన చర్చలకు కూడా దారి తీశాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె బాలీవుడ్ సినిమాలో నటిస్తూ నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది. ఇక ఆమె హీరోయిన్ గా కంటే కూడా ఎప్పుడు కాంట్రవర్సీలో నిలుస్తూ ప్రేక్షకుల నోట్లో ఎప్పుడూ ఆమె పేరు వినిపించేలా చేస్తుంది.

    అయితే ఆమెకు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది బిహేవియర్స్ నచ్చకపోవడం వల్లే తను సెలెక్టెడ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నానని, చాలా ఆఫర్లు వచ్చిన కూడా వాటిని రిజెక్ట్ చేస్తూ వస్తున్నానని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇక మొత్తానికైతే లెజెండ్ తో ఒక భారీ సక్సెస్ ని అందుకున్న రాధిక ఆప్టే తెలుగులో తన ప్రస్థానాన్ని చాలా తక్కువ రోజుల్లోనే ముగించడం అనేది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతుంది…