https://oktelugu.com/

Navneet & Ravi Rana: మన తెలుగు హీరోయిన్/ ఎంపీ ‘నవనీత్ ’ మహారాష్ట్రలో ఇలా ఎందుకు రచ్చ చేస్తోంది? వెనుక ఎవరున్నారు?

Navneet & Ravi Rana : తెలుగులో ‘శ్రీను వాసంతి లక్ష్మీ’, జాబిలమ్మా, శత్రువు వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసి మంచి పేరు తెచ్చుకుంది నవనీత్ కౌర్. తెలుగువారికి సుపరిచితురాలే. కానీ పెళ్లి తర్వాత ఈమె కథే మారిపోయింది. మహారాష్ట్ర ఎమ్మెల్యే రవి రాణాను పెళ్లి చేసుకున్నాక ఆయన బాటలోనే రాజకీయాలకు పరిమితం అయ్యారు. ప్రస్తుతం ఈ దంపతుల పేర్లే మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్ లో చిన్న హీరోయిన్ గా మొదలైన […]

Written By:
  • NARESH
  • , Updated On : April 28, 2022 11:50 am
    Follow us on

    Navneet & Ravi Rana : తెలుగులో ‘శ్రీను వాసంతి లక్ష్మీ’, జాబిలమ్మా, శత్రువు వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసి మంచి పేరు తెచ్చుకుంది నవనీత్ కౌర్. తెలుగువారికి సుపరిచితురాలే. కానీ పెళ్లి తర్వాత ఈమె కథే మారిపోయింది. మహారాష్ట్ర ఎమ్మెల్యే రవి రాణాను పెళ్లి చేసుకున్నాక ఆయన బాటలోనే రాజకీయాలకు పరిమితం అయ్యారు. ప్రస్తుతం ఈ దంపతుల పేర్లే మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తున్నాయి.

    ఒకప్పుడు టాలీవుడ్ లో చిన్న హీరోయిన్ గా మొదలైన నటి నవనీత్ కౌర్ ప్రస్థానం ఇప్పుడు మహారాష్ట్రలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏకంగా మహారాష్ట్ర సీఎంతోనే పెట్టుకొని ఈమె, ఈమె భర్త తెగ ఫేమస్ అయ్యారు. వార్తల్లో నిలిచారు. ఒక ఎమ్మెల్యే, ఎంపీలు అయ్యిండి ఏకంగా మహారాష్ట్ర సీఎంతో వీరు పెట్టుకోవడానికి కారణమేంటి? ఇంత రచ్చ ఎందుకు చేశారు? దీని వెనుక ఎవరున్నారు? వీరిని ఎవరు ఆడిస్తున్నారన్న ప్రశ్నలు మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్నాయి.

    నవనీత్ – రవి రాణా దంపతులు ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ ప్రియ శిష్యులు అని తెలిసింది. ఆయన ప్రోద్బలంతోనే మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ రాజకీయ వేషాలు వేస్తూ హల్ చల్ చేస్తున్నట్టు సమాచారం. బీజేపీ సపోర్టుతోనే వీరు నానా యాగీ చేస్తున్నారని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయాల్లో పేరు, పాపులారిటీ కోసం ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు.

    2014లో మాజీ మోడల్ టాలీవుడ్ నటిగా మొదలైన నవనీత్ రాణా ప్రస్థానం అనంతరం ఓ ఎమ్మెల్యే అయిన రవి రాణాను పెళ్లి చేసుకోవడంతో మలుపు తిరిగింది. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో ఈమె రాజకీయ కుటుంబమైన రవిరాణాను పెళ్లి చేసుకుంది. అనంతరం భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) ఎంపీ టిక్కెట్‌పై పోటీ చేసింది. ఆమె భర్త రవి రాణా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. నవీనీత్ అమరావతి ఎంపీగా.. రాణా ఎమ్మెల్యేగా గెలిచాడు. వీరిది బాగా డబ్బున్న కుటుంబం కావడంతో ఆ ప్రవాహంలో గెలిచేశారు.

    అయితే ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో.. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని ప్రభుత్వాలకు ఈ జంట తమ విధేయతను మార్చుకున్నారు. కేంద్రంలోని బీజేపీకి సపోర్టుగా మారి గెలిచిన ఎన్సీపీకి హ్యాండ్ ఇచ్చారు.

    ఐదేళ్ల తర్వాత 2019లో లోక్‌సభ ఎన్నికల్లో నవనీత్ స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేశారు. ఆమె భర్త రవి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఎన్సీపీ మద్దతుతో పోటీ చేశారు. మళ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ జంట మరోసారి బీజేపీలోకి మారారు. మొత్తానికి రవి మరియు నవనీత్ రాణా కాంగ్రెస్ -ఎన్సీపీలను తీవ్రంగా విమర్శించే బాబా రామ్‌దేవ్‌కు అత్యంత అనుంగ అనుచరులు..సన్నిహితులు. అందుకే బీజేపీ వ్యతిరేకులపై రాందేవ్ బాబా సూచనలతోనే ఇలా గోలగోల చేస్తున్నారని.. రాజకీయ మైలేజ్ కోసం ‘హనుమాన్ చాలీసా’ వివాదాన్ని తెరపైకి తెచ్చి ఏకంగా మహారాష్ట్ర సీఎంను టార్గెట్ చేశారని సమాచారం.

    Also Read: Abu Dhabi: బాల్కనీలో బట్టలు ఆరేస్తే అంతే.. రూ.20 వేల జరిమానా కట్టుకోవాల్సిందే

    అనేక వైరుధ్యాలు ఉన్నప్పటికీ 2014 నుంచి అమరావతికి చెందిన రానా కుటుంబం తమ రాజకీయ పలుకుబడిని నియోజకవర్గంలో స్థిరంగా నిర్మించుకున్నారు. రవి రాణా ఇప్పుడు అమరావతిలోని బద్నేరా నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అతని భార్య, నవనీత్ కౌర్ రాణా 2019లో మొదటి స్వతంత్ర మహిళా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో ప్రబలంగా ఉన్న నరేంద్ర మోడీ వేవ్‌ ను తట్టుకొని గెలిచిన వారిలో ఈ ఇద్దరు ముఖ్యలు. బీజేపీ గాలిని తట్టుకొని మరీ గెలిచి తమ కీర్తిని పెంచుకున్నారు.

    గత కొన్ని రోజులుగా ఈ జంట ‘హనుమాన్ చాలీసా’ వివాదాన్ని ఎత్తుకుంది. ఈ నెల ప్రారంభంలో థాకరే నివాసం వద్ద తమతో కలిసి హనుమాన్ చాలీసాను పఠించమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేని సవాలు చేస్తూ హల్ చల్ చేసింది. శివసేన కార్యకర్తల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఈ జంట నానా హంగామా చేసింది. వీరిపై దేశద్రోహం తదితర ఆరోపణలపై ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

    అమరావతి జిల్లా ఉన్న విదర్భ ప్రాంతానికి వీరిద్దరూ కూడా రాజకీయాల్లో ఫోకస్ కావాలనే ఇలా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. రాణాలు రాజకీయాల్లో చాలా జూనియర్ లు.. అయితే అక్కడి రాజకీయాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. మారుతున్న ఆటుపోట్లకు అనుగుణంగా తమ రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్నారు. వీరు సంపన్నులు కావడంతో ఎన్నికల్లో పోరాడి గెలవడానికి వారికి ఆర్థిక బలం అండగా ఉందని చెబుతున్నారు.

    Also Read: F3 Movie Song: ‘ఊ ఆ అహ అహ’తో ఊపు తెచ్చిన ‘ఎఫ్ 3’