Pavan Kalyan Without Remuneration: టాలీవుడ్ లో ప్రస్తుతం మన స్టార్ హీరోలందరూ ఒక్కో సినిమాకి 40 నుండి 50 కోట్ల రూపాయిల పారితోషికం తీసుకుంటారు అనే టాక్ ఎప్పటినుండో ఉంది..పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకున్న రామ్ చరణ్, ప్రభాస్ మరియు అల్లు అర్జున్ వంటివారు ఒక్కో సినిమాకి 100 కోట్లు కూడా డిమాండ్ చేస్తున్నారు అని సోషల్ మీడియా లో మనం చాలా వార్తలే చూసాము..ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకి 50 నుండి 60 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటాడు అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్..ఇది కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న సినిమాలకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా విడుదలై లాభాలు వచ్చిన తర్వాత వాటాలు అడుగుతునట్టు సమాచారం..సర్దార్ గబ్బర్ సింగ్ నుండి పవన్ కళ్యాణ్ ఈ సిస్టం ని ఫాలో అవుతున్నట్టు సమాచారం..కానీ దురదృష్టకరం ఏమిటి అంటే సర్దార్ గబ్బర్ సింగ్..కాటమరాయుడు మరియు అజ్ఞాతవాసి సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అవ్వడం తో పవన్ కళ్యాణ్ ఆర్థికంగా చాలా నష్టపోయాడట.
తన సినిమా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బులు తిరిగి ఇచ్చే అలవాటు ఉన్న పవన్ కళ్యాణ్ ఈ మూడు సినిమాలు ఫ్లాప్ అవ్వడం తో డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ స్థాయిలోనే మూల్యం చెల్లించుకున్నాడు..గతం లో కూడా ఆయన స్వీయ దర్శకత్వం లో తెరకెక్కిన జానీ సినిమా పెద్ద ఫ్లాప్ అయితే తాను తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తం బయ్యర్లకు తిరిగి ఇచ్చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..అంటే ఆ సినిమా పవన్ కళ్యాణ్ అన్నేళ్లు కస్టపడి ఉచితంగా చేసినట్టు అయ్యింది..అయితే ఇటీవల విడుదల అయిన వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ సినిమాల ద్వారా పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలోనే లాభాలు పొందినట్టు తెలుస్తుంది..ఎన్నో రాజకీయ వత్తిడుల మధ్యన విడుదలైన ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..కేవలం ఈ రెండు సినిమాల ద్వారా పవన్ కళ్యాణ్ 100 కోట్ల రుపాయిల లాభాలను పొందినట్టు సమాచారం..ప్రస్తుతం ఆయన ప్రముఖ దర్శకుడు క్రిష్ తో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఒక్క సినిమా కోసం పవన్ కళ్యాణ్ 60 కోట్ల రూపాయిలు పారితోషికంగా అందుకునట్టు సమాచారం..ఇప్పటికే 50 శాతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.