Star Heroine Brother Arrested: బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా చలామణి అవుతున్న హీరోయిన్ శ్రద్ధ కపూర్..ఈమె యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన సాహూ సినిమా ద్వారా తెలుగు వెండితెర కి కూడా పరిచయం..అందం తో పాటుగా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్న శ్రద్ద కపూర్ కి ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఒక్కో సినిమాకి గాను ఈమె 5 నుండి 6 కోట్ల రూపాయిల వరుకు పారితోషికం అందుకుంటుంది..బాలీవుడ్ హీరోయిన్స్ అంటే ఎప్పుడూ గాసిప్స్ లో ఉంటారు అనే టాక్ ఉన్న విషయం మన అందరికి తెలిసిందే..కానీ శ్రద్ద కపూర్ వీటి అన్నిటికి దూరం అనే మంచి పేరు ఉంది..అలాంటి మంచి పేరు ఇప్పుడు తన సోదరుడు సిద్దాంత్ కపూర్ వల్ల చెడిపోయిందని బాలీవుడ్ మొత్తం కోడై కూస్తుంది.

ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల బెంగళూరు లోని ఒక్క ప్రముఖ హోటల్ లో జరిగిన రేవ్ పార్టీ పై పోలీసులు రైడింగ్స్ చేసారు..ఈ పార్టీలో సిద్దాంత్ కపూర్ తో పాటు మరో 5 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు..అయితే తన సోదరుడు అరెస్ట్ అయిన విషయం శ్రద్దా కపూర్ అందరితో పాటు తాను కూడా టీవీ లో చూసే తెలుసుకుంది అట..పొద్దున్న నిద్ర లేచి టీవీ చూస్తున్న సమయం లో తన సోదరుడు అరెస్ట్ అయ్యినట్టు వార్తలు వచ్చింది అని..ఆ వార్త చూసిన వెంటనే షాక్ కి గురయ్యాను అని చెప్పుకొచ్చింది శ్రద్దా కపూర్..అసలు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి తన సోదరుడికి ఫోన్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ రాలేదని..అసలు మా సోదరుడిని ఎందుకు అరెస్ట్ చేసారు అనేది క్లారిటీ లేదని చెప్పుకొచ్చింది శ్రద్దా కపూర్..అయితే పోలీసుల కథనం ప్రకారం రావే పార్టీ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నప్పుడు సిద్దాంత్ కపూర్ ని పట్టుకున్నాం అని..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రెస్ మీట్ లో తెలియచేస్తాం అని చెప్పుకొచ్చారు..ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం ఈ సంఘటన టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.
