
సినీరంగానికి చెందిన వారసుడు అయితే.. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అవకాశమే వెతుక్కుంటూ వస్తుంది. అదే బయటి వ్యక్తి ఇండస్ట్రీలోకి రావాలంటే.. ఎన్ని దిగిరావాలో తెలుసా? ఎన్ని ఎక్కాలో తెలుసా..? ఈ గ్యాప్ లో మరెన్ని కోల్పోవాలో తెలుసా..? అది అనుభవించిన వారికీ.. కోల్పోయిన వారికి మాత్రమే తెలుసు. అయితే.. ఇన్ని చేసినా అవకాశం రానివారు, సక్సెస్ అందుకోలేని వారు ఎందరో..?! ఇదేవిధంగా ప్రయాణం మొదలు పెట్టాడు నవీన్ పొలిశెట్టి. చివరకు సాధించాడు. మరి, ఇవాళ జాతిరత్నమై వెలగడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో చూద్దాం.
Also Read: ఇది సమయం కాదు.. సందర్భమూ కాదు.. పొలిటికల్ ఎంట్రీపై తారక్
సీన్ ఓపెన్ చేస్తే.. చిన్ననాటి నుంచే నటనపై ప్రేమ పెంచుకున్న నవీన్ పోలిశెట్టి.. ఎలాగైనా ఇండస్ట్రీకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ.. అందరి తల్లిదండ్రుల్లాగానే వీళ్ల పేరెంట్స్ కూడా అబ్జక్షన్ అన్నారు. ఎంపీసీ పూర్తి చేసి, ఏఐట్రిపుల్ ఈ చేయమన్నారు. మనోడు అయిష్టంగానే కంప్లీట్ చేశాడు. కానీ.. మనసు మాత్రం వెండితెర వైపే లాగుతోంది.
బట్ పేరెంట్స్ మాత్రం కళ్లెం వేసి లాగుతున్నారు. యాక్టింగ్ లేదు ఏమీలేదు.. బుద్ధిగా ఉద్యోగం చేసుకోమని హెచ్చరించారు వాళ్ల ఫాదర్. తప్పలేదు.. లండన్ వెళ్లిపోయాడు. అక్కడ మంచి ఉద్యోగం. మంచి సాలరీ.. పేరెంట్స్ ఫుల్ హ్యాపీ.. మనోడు మాత్రం చాలా డల్. ఏదో యంత్రంలా పనిచేస్తూ వెళ్తున్నాడు కానీ.. అందులో ఫీల్ లేదు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. ఒకరోజు బలంగా డిసైడ్ అయ్యాడు. లండన్ రిట్న్ అంటూ ఇండియాలో దిగిపోయాడు జాబు వదిలేసి!
ఇంట్లో మాత్రం వెకేషన్ కు వచ్చానని చెప్పాడు. వెళ్లి థియేటర్స్ లో జాయిన్ అయ్యాడు. చాలా రోజులవుతున్నా తిరిగి వెళ్లకపోవడంతో పేరెంట్స్ కు డౌట్ వచ్చేసింది. విషయం ఆరాతీస్తే.. క్లైమాక్స్ బ్లాస్ట్ అయ్యింది. అసలు నిజం తెలిసిన తండ్రికి గుండె ఆగినంత పనైంది. తిట్లు, శాపనార్థాలు అన్నీ ముగిసిన తర్వాత.. బలంగా డిసైడ్ అయ్యాడు నవీన్.. తాను ఇక ఇంగ్లండ్ వెళ్లేది లేదని! కానీ.. ఇంట్లోంచి వెళ్లిపోవాల్సి వచ్చింది!
సీన్ ఓపెన్ చేస్తే.. బాంబే. అక్కడే ఏం చేసైనా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. అక్కడ రెంట్ భారీగా ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో చిన్న రూమ్ తీసుకొని పోరాటం మొదలు పెట్టాడు. రోజూ ఐదారు ఆడిషన్స్ కు వెళ్లొచ్చేవాడు. కానీ.. సెట్ కాలేదు. అలా రోజులు గడుస్తున్నాయి. సంవత్సరాలు కూడా గడుస్తున్నాయి! పరిస్థితి దారుణంగా తయారైంది. ఉద్యోగం అనివార్యం. ఈ మధ్యలోనే గాయాలు. అయినప్పటికీ.. ప్రయత్నం మాత్రం ఆపలేదు.
Also Read: అమ్మాయిని అది అడిగిన హైపర్ ఆదీ.. ఇంత దారుణమా? అని అందరూ షాక్!
ఇంట్లోంచి డబ్బులు అడక్కుండా.. చేసిన పనికి వచ్చే డబ్బులు చాలకుండా.. ఆడిషన్స్ లో సెలక్ట్ కాకుండా.. హబ్బో.. ఒకటా రెండా.. ఎన్నో కష్టాలు అనుభవించాడీ ఫ్యూచర్ హీరో. చివరకు వన్ ఫైన్ డే ఓ ఛాన్స్ వచ్చింది. ఆ వెంటనే రెండోది. సేమ్ టైమ్ లో షూట్. అనివార్యంగా ఒకటి క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆ తర్వాత చూస్తే.. రెండో దాంట్లో కూడా హీరో మారిపోయాడు. మళ్లీ కష్టాలు.. కన్నీళ్లు రిపీట్.
ఆ తర్వాత ఒక షోకు వెళ్లాడు. అందులో మనోడి యాక్టింగ్ చూసి భలే చేస్తున్నాడే అనుకున్నారు ఏఐపీ షోస్ వారు.. అలా ప్రమోట్ అవుతూ వచ్చాడు. చాలా కాలం అవీఇవీ షోలు చేస్తూ వచ్చాడు. సీన్ కట్ చేస్తే.. శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లో ఛాన్స్. ఆ సినిమా చూసిన దర్శకుడు స్వరూప్.. ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ సినిమా గురించి అప్రోచ్ అయ్యాడు. కాన్సెప్ట్ వెరైటీ ఉందని కనెక్ట్ అయ్యాడు. ఆడియన్స్ మనోడికి కనెక్ట్ అయ్యారు.
ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుంటే మన ‘జాతిరత్నాలు’ తయారయ్యాయి. ఇప్పుడు ఈ మూవీ థియేటర్లలో దున్నేస్తోంది. అలా.. తెలుగు తెరపై ఓ రత్నమై వెలగడానికి సినిమా కష్టాలను మించి అనుభవించాడు నవీన్ పొలిశెట్టి. అన్ని దెబ్బలు తిని ఇప్పుడు టాలీవుడ్లో మేలిమై రత్నమై వెలుగుతున్నాడు. మరి, మన నవీన్ కు మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్