దేశంలో చాలామందికి పొగ తాగే అలవాటు ఉంటుంది. పొగ తాగే అలవాటు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా శాస్త్రవేత్తల అధ్యయనంలో ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. తండ్రుల్లో ఉండే పొగ తాగే అలవాటు పిల్లల పాలిట శాపంగా మారుతోందని శాస్త్రవేత్తలు తేల్చారు. బ్రాడ్‌ఫోర్ట్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం తల్లిదండ్రులకు పొగతాగే అలవాటు ఉంటే పిల్లలు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది.
పొగ తాగే తల్లిదండ్రుల వల్ల పిల్లలు ప్రధానంగా లుకేమియా బారిన పడే అవకాశం ఉంటుంది. పిల్లలు లుకేమియా బారిన పడటానికి కూడా శాస్త్రవేత్తలు కారణాలను వెల్లడిస్తున్నారు. సిగరెట్ల పొగ వల్ల జన్యువులను పిల్లలకు అందించే వీర్యకణాల్లోని డీఎన్‌ఏ దెబ్బ తింటుందని ఫలితంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాంటి డీఎన్‌ఏ వల్ల పిల్లల్లో క్యాన్సర్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
ఎవరైనా దంపతులు గర్భధారణకు ప్లాన్ చేసుకుంటే కనీసం మూడు నెలల ముందే పొగ తాగే అలవాటు ఉండాలి. వీర్యకణం ఉద్భవించాక అది పూర్తిస్థాయిలో పరిణతి చెందేందుకు 90 రోజుల సమయం పడుతుందని కనీసం 90 రోజుల పాటు పొగ తాగే అలవాటుకు దూరంగా ఉంటే మాత్రమే దెబ్బతిన్న వీర్యకణాల స్థానంలో కొత్త కణాలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా పిల్లల్లో క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
తల్లిదండ్రులు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని భావిస్తే పొగకు దూరంగా ఉండాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పొగ తాగడం వల్ల నష్టాలే తప్ప ఎటువంటి లాభాలు లేవు కాబట్టి పొగ తాగడానికి వీలైనంత దూరంగా ఉంటే మంచిది.