https://oktelugu.com/

Telangana Slang In Tollywood: తెలంగాణ యాసలో వచ్చి బంపర్ హిట్టు కొట్టిన సినిమాలేవో తెలుసా?

మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ తెలంగాణ యాసలో మాట్లాడి ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఒక అగ్ర హీరో తెలంగాణ యాసలో మాట్లాడిన ఫస్ట్ మూవీ ఇదే. ఇక ఈ మూవీ బంపర్ హిట్ సాధించడంతో ఈ సినిమా తర్వాత కొందరు హీరోలు తెలంగాణ యాసలో మాట్లాడడం మొదలుపెట్టారు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 26, 2023 / 11:30 AM IST

    Telangana Slang In Tollywood

    Follow us on

    Telangana Slang In Tollywood: ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయాలంటే సినిమాలో కొత్తదనం ఉండాలి. సినిమాలకు కథతో పాటు డైలాగ్ లు కూడా ఇంపార్టెంటే. ఇవి ఆకట్టుకునేవిధంగా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇటీవల ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి ప్రాంతీయ యాస మాట్లాడుతున్నారు. లోకల్ వాయిస్ తో డైలాగ్స్ చెప్పడంతో స్థానికులను ఆకట్టుకోవడంతో పాటు ఇతరులకు కొత్తగా ఉంటోంది. దీంతో ప్రాంతీయ భాష, యాసతో మాట్లాడిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ముఖ్యంగా తెలంగాణ యాసతో వచ్చిన ఇటీవల సినిమాలు బాగా పాపులర్ అయ్యాయి. యంగ్ హీరో ప్రియదర్శన్ నుంచి మాస్ మహారాజ రవితేజ వరకు తెలంగాణ భాషలో మాట్లాడి ఆకట్టుకున్నారు. ఇలా తెలంగాణ యాస ప్రధానంగా వచ్చిన ఆ సినిమాలేవో చూద్దాం..

    వకీల్ సాబ్:
    మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ తెలంగాణ యాసలో మాట్లాడి ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఒక అగ్ర హీరో తెలంగాణ యాసలో మాట్లాడిన ఫస్ట్ మూవీ ఇదే. ఇక ఈ మూవీ బంపర్ హిట్ సాధించడంతో ఈ సినిమా తర్వాత కొందరు హీరోలు తెలంగాణ యాసలో మాట్లాడడం మొదలుపెట్టారు.

    జాతిరత్నాలు:
    ఈమధ్య కమెడియన్లు హీరోలుగా రాణిస్తున్నారు. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నవీన్ పోలిశెట్టి లు కలిసి నటించిన మూవీ జాతి రత్నాలు. అనుదీప్ కేవి డైరెక్షన్ లో వచ్చిన ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట బ్యాక్ గ్రౌండ్ లో రూపొందిన ఈ సినిమా కరోనా తర్వాత సూపర్ హిట్ అయిన తొలి చిత్రం. ఇందులో దక్షిణ తెలంగాణ యాస ఎక్కువగా కనిపించడంతో ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యారు.

    లవ్ స్టోరీ:
    శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన అందమైన ప్రేమ కథ చిత్రం లవ్ స్టోరీ. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతంలో జరిగే పరిస్థితులను బేస్ చేసుకొని తీశారు. ఈ మూవీలో నాగచైతన్య తో పాటు మిగతా నటులు అంతా తెలంగాణ యాసలోనే మాట్లాడుతారు. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

    డీజే టిల్లు:
    సిద్ధు జొన్నలగడ్డ హీరో కం డైరెక్టర్ గా వచ్చిన మూవీ డీజే టిల్లు. ఈ సినిమా డిఫరెంట్ క్యారెక్టర్ ను పరిచయం చేయడంతో పాటు పక్కా తెలంగాణ యాస యూత్ ను అట్రాక్ట్ చేసింది. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ లో డీజే టిల్లు నిలిచింది.

    ఆర్ఆర్ఆర్:
    దర్శకుడు రాజమౌళి తరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణలోని కొమరం భీం వాసిగా కనిపిస్తాడు. దీంతో ఎన్టీఆర్ ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టాడు. ఇక ఈ మూవీ ఇటీవల ఆస్కార్ వరకు వెళ్లి అవార్డు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

    వాల్తేరు వీరయ్య:
    మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతి సందర్భంగా రిలీజై బంపర్ హిట్టు కొట్టింది. ఇందులో చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటించారు. ఇందులో రవితేజ ఏసిపి విక్రమ్ పాత్రలో కనిపిస్తారు. ఆయన తెలంగాణ యాసలో మాట్లాడి ఆకట్టుకుంటారు.

    బలగం:
    కమెడియన్ వేణు నటుడుగానే కాకుండా డైరెక్టర్ గా తన ప్రతాపం చూపించి బలగం సినిమా తీశాడు. ఈ మూవీ ఇప్పటికీ సంచలనా సృష్టిస్తూనే ఉంది. తెలంగాణ సమాజంలో జరిగే పరిస్థితులను సహజమైన క్యారెక్టర్స్ తో తీసిన ఇందులో ప్రతి ఒక్క నటుడు తెలంగాణ యాసలోనే మాట్లాడుతాడు. వారు మాట్లాడిన యాస ఆడియన్స్ మనసులను దోచేసింది. అందుకే ఈ సినిమా కూడా బంపర్ హిట్ కొట్టింది.