https://oktelugu.com/

Actor Naresh: లిప్ లాక్ 20 ఏళ్ల వాళ్లే పెట్టుకోవాలా 60 ఏళ్ల వాళ్లు పెట్టుకోకూడదా… నరేష్ దిమ్మతిరిగే ఆన్సర్

నరేష్ ఏకంగా తన జీవితాన్ని బయోపిక్ గా తెరపైకి తెస్తున్నారు. మళ్ళీ పెళ్లి మొత్తంగా నరేష్-పవిత్ర లోకేష్-రమ్య రఘుపతి గురించి. ఇది మా జీవితం కాదని నరేష్ బుకాయిస్తున్నా ట్రైలర్, టీజర్ తో ఆయనే క్లారిటీ ఇచ్చారు.

Written By:
  • Shiva
  • , Updated On : May 26, 2023 / 11:38 AM IST

    Actor Naresh

    Follow us on

    Actor Naresh: ఏడాది కాలంగా నటుడు నరేష్ లోని కొత్త కోణాన్ని జనాలు చూస్తున్నారు. నిజానికి ఆయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయన్న విషయం గతంలో ఎవరికీ తెలియదు. పవిత్ర లోకేష్ తో సహజీవనం అనంతరం నరేష్ వ్యక్తిగత జీవితం వెలుగులోకి వచ్చింది. మూడో భార్య రమ్య రఘుపతి సైతం మీడియా ముందుకు వచ్చింది. ఎప్పటి నుండో నరేష్ తో గొడవలు ఉన్నా రమ్య రఘుపతి అజ్ఞాతం నుండి బయటకు రాలేదు. పవిత్ర లోకేష్ ని ఆయన నాలుగో వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం మొదలయ్యాక రమ్య రఘుపతి మీడియా సమావేశాలు పెట్టారు.

    నరేష్ ఏకంగా తన జీవితాన్ని బయోపిక్ గా తెరపైకి తెస్తున్నారు. మళ్ళీ పెళ్లి మొత్తంగా నరేష్-పవిత్ర లోకేష్-రమ్య రఘుపతి గురించి. ఇది మా జీవితం కాదని నరేష్ బుకాయిస్తున్నా ట్రైలర్, టీజర్ తో ఆయనే క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఈ ముగ్గురు జీవితాల్లో చోటు చేసుకున్న యధార్థ ఘటనలను ట్రైలర్ లో చూపించారు. మైసూర్ హోటల్ లో పవిత్ర లోకేష్-నరేష్ ఉన్నారని తెలిసి రమ్య రఘుపతి బయట బైఠాయించింది. అక్కడ జరిగిన హైడ్రామాను మక్కీకి మక్కీ మళ్ళీ పెళ్లి మూవీలో పెట్టారు.

    మళ్ళీ పెళ్లి బోల్డ్ మూవీ అని నరేష్-పవిత్ర లోకేష్ చెబుతున్నారు. ఇక ఇద్దరి మధ్య లిప్ లాక్ సన్నివేశాలు కూడా ఉన్నాయట. ఈ వయసులో లిప్ లాక్ సన్నివేశాలు అవసరమా అని యాంకర్ అడగ్గా… నరేష్ ఆసక్తికర సమాధానం చెప్పారు. లిప్ లాక్ అనేది 20 ఏళ్ల వాళ్లే చేసుకోవాలా? 60 ఏళ్ళ వాళ్ళు చేసుకోకూడదా?. లిప్ లాక్ ఒక ఎమోషన్ . ఎదుటి వ్యక్తులపై మనకు ఎంత ప్రేమ ఉందో తెలియజేసే ఒక చర్య. అంతే కానీ ఈ వయసు వాళ్లే లిప్ లాక్ చేయాలనే నియమం లేదని అన్నారు.

    మళ్ళీ పెళ్లి మే 26న విడుదలైంది. మూవీపై విపరీతమైన బజ్ ఏర్పడింది. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. మళ్ళీ పెళ్లి చిత్రానికి ఎమ్ ఎస్ రాజు దర్శకత్వం వహించారు. నరేష్ స్వయంగా నిర్మించి నటించారు. శరత్ కుమార్, జయసుధ, వనిత విజయ్ కుమార్ కీలక రోల్స్ చేశారు. కాగా మళ్ళీ పెళ్లి చిత్ర విడుదల ఆపేయాలంటూ రమ్య రఘుపతి పిటిషన్ వేశారు. ఈ మూవీ తన గౌరవానికి భంగం కలిగించేదిగా ఉందని ఆమె నాంపల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.