Nizamabad Tollywood Actress: టాలీవుడ్ ను దున్నేస్తున్న నిజామాబాదోళ్లు.. నితిన్ నుంచి దిల్ రాజు, శ్రీముఖి వరకూ .. ఎంతమందంటే?

జయం సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయిన నితిన్ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగారు. అయితే ఈమధ్య నితిన్ సినిమాలు తక్కువయ్యాయి. కానీ వరుస సినిమాల్లో నటిస్తూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. నితిన్ తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన వ్యక్తి. ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం డిస్ట్రిబ్యూటర్. తండ్రి చొరవతో నితిన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Written By: Chai Muchhata, Updated On : May 26, 2023 11:11 am

Nizamabad Tollywood Actress

Follow us on

Nizamabad Tollywood Actress: సినిమాల్లో అవకాశాలు రావలంటే ఇప్పటికైనా గగనమే. ఎంతో ప్రతిభ, సహనం ఉంటే తప్ప చాన్స్ రాదు. మొన్నటి వరకు ఇండస్ట్రీలో ఆంధ్రావాళ్లదే హవా సాగిందన్న ప్రచారం సాగింది. అంతేకాకుండా కేవలం కమెడియన్లను మాత్రమే తెలంగాణ నుంచి తీసుకొని వారిపై వివక్ష చూపేవారన్న ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా చాలా మంది నటులు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నవారున్నారు. కమెడియన్లుగానే కాకుండా హీరోగా, నిర్మతగా తమ సత్తా చాటుతున్నారు. మరి తెలంగాణ నుంచి.. అదీ ఒకే జిల్లా నుంచి కొందరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. వారెవరో చూద్దామా.

నితిన్:
జయం సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయిన నితిన్ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగారు. అయితే ఈమధ్య నితిన్ సినిమాలు తక్కువయ్యాయి. కానీ వరుస సినిమాల్లో నటిస్తూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. నితిన్ తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన వ్యక్తి. ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం డిస్ట్రిబ్యూటర్. తండ్రి చొరవతో నితిన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

దిల్ రాజు:
ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు కూడా నిజామాబాద్ కు చెందిన వ్యక్తే. తెలుగు ఇండస్ట్రీల్లోనే ప్రముఖ నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఆయన ఇటీవల ‘బలగం’ తీసి మరింత ఫేమస్ అయ్యాడు.

వెన్నెల కిశోర్:
టాలీవుడ్ లో టాప్ కమెడియన్లలో వెన్నెల కిశోర్ ఒకరు. ‘వెన్నెల’ అనే సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన నేటి ప్రతి సినిమాల్లో కనిపిస్తున్నారు. వెన్నెల కిశోర్ అంతకుముందు విదేశాల్లో ఉద్యోగం చేసినా..సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

శివజ్యోతి:
న్యూస్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన శివజ్యోతి ప్రస్తుతం టీవీ ఎంటర్టైన్మెంట్ లో బిగ్ సెలబ్రెటీ అని చెప్పుకోవచ్చు. ఈమె నిజమాబాద్ జిల్లాలోనే పుట్టి పెరిగింది. ప్రస్తుతం ఓ టీవీలో యాంకర్ గా కొనసాగుతోంది.

చమ్మక్ చంద్ర:
జబర్దస్త్ కమెడియన్లలో చమ్మక్ చంద్ర ఒకరు. విభిన్న శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. చమ్మక్ చంద్ర నిజామాబాద్ జిల్లాకు చెందిన వారే. కొన్ని సినిమాల్లోనూ నటించిన ఈయన కొన్ని చానెళ్లలోని కామెడీ షో లో కనిపిస్తున్నారు.

అదితి మ్యక్వాల్:
నిజామాబాద్ కు చెందిన మరో నటి అదితి మ్యక్వాల్. తెలుగు సినిమాల్లోకొనసాగుతున్న ఈమెకె సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్. అందుకే వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు పోతున్నారు.