Mahesh Babu And Rajamouli: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా రేంజ్ లో తనదైన రీతిలో సక్సెస్ చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ఒక పాన్ వరల్డ్ సినిమా రాబోతుంది. ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది అనే దాని మీదనే ప్రతి ఒక్క అభిమాని కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. అది ఏంటి అంటే ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని పాన్ వరల్డ్ లో తెరకెక్కించబోతున్నట్టు గా ఈ సినిమాని రాజమౌళి తీర్చిదిద్దబోతున్నాడు అనే వార్త అయితే బాగా వినిపిస్తుంది. ఈ సినిమా కోసం రాజమౌళి ఏకంగా 800 కోట్లు బడ్జెట్ ని పెట్టబోతున్నట్టు గా కూడా సమాచారం అందుతుంది.ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ట్రేడ్ పండితులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు 800 కోట్లు అంటే మామూలు విషయం కాదు 500 కోట్ల తో తీసిన బాహుబలి నే ఆ రేంజ్ లో తీసిన రాజమౌళి ఈ సినిమాని ఏ రేంజ్ లో తీస్తాడో చూడాలి అంటున్నారు.
ఓన్లీ ప్రీ ప్రొడక్షన్ కోసమే 100 కోట్లకు పైన ఖర్చు చేస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది. ఇక షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ లెక్కలు అనేవి మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ రేంజ్ లో బడ్జెట్ ని పెట్టిస్తున్నాడంటే ఈ సినిమా దాదాపు 3,000 కోట్లకు పైన కలక్షన్లను రాబట్టే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్లభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఏప్రిల్ లో సెట్స్ మీదికి వెళ్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఈ సినిమా తో మహేష్ బాబు ఒక్కసారిగా పాన్ వరల్డ్ లో తన సత్తా చాటుబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు ఈ సినిమా సంక్రాంతి కనుక గా జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఆ తర్వాత మహేష్ బాబు తన పూర్తి టైమ్ ని రాజమౌళి సినిమా కోసం కేటాయించబోతున్నట్టు గా తెలుస్తుంది…