Sunrisers Hyderabad: గత నెల దుబాయ్ లో నిర్వహించిన ఐపిఎల్ మినీ వేలం లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం విదేశీ ప్లేయర్లు ముగ్గురిని కొనుగోలు చేసింది. వారి కోసం భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి మరి వాళ్ళని కొనుగోలు చేసింది. అయితే ఈ కొనుగోలు చూసిన చాలా మంది సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అభిమానులు కూడా అంత డబ్బులు చెల్లించి ఆ విదేశీ ప్లేయర్లను ఎందుకు కొనుగోలు చేశారు అంటూ నెగిటివ్ కామెంట్స్ అయితే చేశారు.
కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కావ్యమారన్ చేసింది మంచి పని అంటూ పలువురు సీనియర్ ప్లేయర్లతో పాటు ఎస్ ఆర్ హెచ్ టీమ్ అభిమానులు కూడా కొనియాడుతున్నారు దీనికి కారణం ఏమిటంటే ప్రపంచ కప్ లో దారుణమైన పేలవమైన పెర్ఫామెన్స్ ని ఇచ్చిన శ్రీలంక టీమ్ మొత్తాన్ని మర్చేస్తు శ్రీలంక బోర్డ్ ఆ టీమ్ కి టి20 కెప్టెన్ గా అల్ రౌండర్ ప్లేయర్ అయిన హాసరంగ ని నియమించింది. లంక ప్రీమియర్ లీగ్ లో క్యాండీ జుట్టుకు సారథి గా వ్యవహరించిన హసరంగ ఆ టీం కి టైటిల్ అందించాడు. దాంతో తను కూడా ఎస్ ఆర్ హెచ్ టీం కెప్టెన్సీ పోటీలో నిలిచాడు.
ఇక దీంతో కావ్య మారన్ అతన్ని కోటి 50 లక్షలకు మాత్రమే దక్కించుకొని మంచి పని చేశారు అంటూ పలువురు సీనియర్ ప్లేయర్లు కావ్య ని అభినందిస్తున్నారు. ఇక ఇప్పుడు ఇంతకు ముందే టీంలో కెప్టెన్ గా ఉన్న మార్కరంతో పాటు ప్యాట్ కమ్మిన్స్,అలాగే హసరంగ కూడా కెప్టెన్సీ రేస్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.
మరి ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ గా వ్యవహరిస్తారు అనే విషయం మీద ఇప్పటికైతే క్లారిటీ రాలేదు కానీ ప్యాట్ కమ్మిన్స్ ఆస్ట్రేలియా టీమ్ కి వరల్డ్ కప్ అందించాడు కాబట్టి అతన్ని సన్ రైజర్స్ టీమ్ 20 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేయడం వెనక కారణం కూడా అతన్ని కెప్టెన్ గా చేయడం కోసమే అంటు పలువురు క్రికెట్ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి ఇప్పుడు హసరంగ కూడా కెప్టెన్ గా తన సత్తా ఏంటో చూపిస్తూ వస్తున్నాడు. కాబట్టి అతను కూడా కెప్టెన్ గా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ ఇంకా కొంత మంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.