Aha Naa Pellanta: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది రచయితలు వాళ్ల పెన్నుతో ఎన్నో అద్భుతాలను సృష్టించారు. అప్పటి పింగళి గారి నుంచి ఇప్పటి త్రివిక్రమ్ వరకు ప్రతి ఒక్క రైటర్ ఇండస్ట్రీ మీద ప్రత్యేకమైన ముద్రను వేయడమే కాకుండా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు రైటర్లుగా కొనసాగుతూ సినిమా స్థాయిని పెంచారనే చెప్పాలి. ఇక వీళ్ళందరిలో జంధ్యాల గారి రైటింగ్ స్టైల్ సపరేట్ గా ఉంటుంది.
ఇక అందులో భాగంగానే జంధ్యాల డైరెక్షన్ లో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ‘అహనా పెళ్ళంట’ సినిమా కామెడీ జానర్ లో తెరకెక్కి సంచలనను క్రియేట్ చేసింది. ఈ సినిమా సాధించిన సక్సెస్ తో జంధ్యాల ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమాలో పిసినారి పాత్రలో కోట శ్రీనివాసరావు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందనే చెప్పాలి. ఇప్పటివరకు కోట శ్రీనివాసరావు పోషించిన పాత్రల్లో టాప్ 5 కనక తీస్తే అందులో ఇది డెఫినెట్ గా ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
అయితే ఈ పాత్రలో మొదటగా తెలుగులో తన నటనతో చాలామంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న ‘రావు గోపాల్ రావు’ ను తీసుకుందామని జంధ్యాల అనుకున్నాడట. కానీ ఆయన వరుస సినిమాలు కమిటై ఉండడం అలాగే ఏ మాత్రం తీరిక లేకుండా ఉండడంతో కోట గారిని సెలెక్ట్ చేసి ఆయనతో ఈ పాత్ర చేయించాడట. ఇక కోట కూడా అప్పుడప్పుడే సినిమా ఇండస్ట్రీలో బిజీ అవుతూ ఉండడంతో ఈ పాత్ర అనేది ఆయనకి మంచి గుర్తింపును తీసుకొచ్చింది..అయితే రావు గోపాల్ రావు తర్వాత గొల్లపూడి మారుతి రావు గారితో కూడా ఈ పాత్రను చేయించాలని అనుకున్నాడట.
కానీ ఆయన కూడా ఈ పాత్ర పట్ల పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో కోట గారికి ఈ అవకాశం వరించింది… ఇక మొత్తానికైతే ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో కోట గారు వెనక్కి తిరిగి చూడకుండా దాదాపు 40 సంవత్సరాలు పాటు ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుతం ఆయనకి వయోభారం ఎక్కువ అవ్వడంతో సినిమాలు చేయకుండా రెస్ట్ తీసుకుంటున్నాడు..