https://oktelugu.com/

Pokiri: పోకిరి ప్రొడ్యూసర్స్ ఎవరు..పూరి ఒక్కడే సోలో గా ఈ సినిమాను ఎందుకు రిలీజ్ చేశాడు.. మ్యాటరెంటంటే..?

ప్రతి హీరోకి ఒక మంచి సక్సెస్ ని ఇచ్చిన పూరీ జగన్నాథ్. ప్రస్తుతం రామ్ తో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే పూరి జగన్నాథ్ పోకిరి సినిమాకి ప్రొడ్యూసర్ అనే విషయం మనకు తెలిసిందే.

Written By:
  • Gopi
  • , Updated On : March 1, 2024 / 08:33 AM IST
    Follow us on

    Pokiri: టాలీవుడ్ లో డేరింగ్ అంటే డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న పూరీ జగన్నాథ్ మహేష్ బాబుతో పోకిరి సినిమా ఎప్పుడైతే చేశాడో అప్పటినుంచి ఆయన పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయిందనే చెప్పాలి. సాఫ్ట్ హీరో ని అంత మాస్ గా చూపించి ఇండస్ట్రీ హిట్టు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. కానీ పూరి మాత్రం దాన్ని చాలా అలవోకగా చేసి చూపించాడు. ఇక ఈ సినిమా సక్సెస్ తర్వాత ప్రతి ఒక్క హీరో పూరి తో సినిమా చేయడానికి ఆయన వెంటపడేవారు.

    అలా ప్రతి హీరోకి ఒక మంచి సక్సెస్ ని ఇచ్చిన పూరీ జగన్నాథ్. ప్రస్తుతం రామ్ తో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే పూరి జగన్నాథ్ పోకిరి సినిమాకి ప్రొడ్యూసర్ అనే విషయం మనకు తెలిసిందే. కానీ ఈ సినిమాకి ఆయనతో పాటు మహేష్ బాబు వాళ్ళ అక్క మంజుల కూడా ఒక ప్రొడ్యూసర్ గా ఉన్నారట. పూరి వైష్ణో అకాడమీ అలాగే మంజుల వాళ్ల ఇందిరా ప్రొడక్షన్స్ రెండు బ్యానర్స్ కలిసి ఈ సినిమాని నిర్మించాయి.

    కానీ సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మంజుల ఈ సినిమా ప్రొడ్యూసర్ గా తప్పుకుందట. దాంతో పూరి సోలోగా ఆయన ఒక్కడే ఈ సినిమాను రిలీజ్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా 50 కోట్ల వరకు కలెక్షన్స్ ను వసూలు చేసింది. 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని కోట్లు వసూలు చేసి అప్పట్లో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసిందనే చెప్పాలి.

    పూరి ఈ సినిమాను సోలోగా రిలీజ్ చేసుకొని సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా తన బ్యానర్ ని కూడా టాప్ లెవల్ కి తీసుకెళ్లాడు. ఎవరు నమ్మిన, నమ్మకపోయినా పూరి మాత్రం ఈ సినిమాను 100% నమ్మాడు. కాబట్టే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే, కాకుండా మహేష్ బాబుకి అప్పటివరకు లేనివిధంగా ఇండస్ట్రీ హిట్ ను అందించాడు.