Goparaju Ramana : సినీ ఇండస్ట్రీ లో ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండే ఆర్టిస్టులకు తిరుగు ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే కొంతమంది ఎంతో కాలం నుండి ఇండస్ట్రీ లో కొనసాగుతున్నప్పటికీ సరైన అవకాశాలు రాకపోవడంతో విసుగొచ్చి ఇండస్ట్రీ నుండి వెళ్లిపోతుంటారు. అలా బయటకి వచ్చినవాళ్లు కాస్త ధనవంతులు అయితే ఏదైనా వ్యాపారం పెట్టుకుంటారు, ఆర్ధిక స్తొమత లేకపోతే జీవితం సర్వ నాశనం అయ్యినట్టే. అలా ఆర్ధిక స్తొమత లేని వారు, అవకాశాలు రావట్లేదని ఇండస్ట్రీ నుండి వెళ్లిపోకుండా కాస్త సహనంతో ఎదురు చూస్తే ఎదో ఒకరోజు ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది అనడానికి ఉదాహరణగా నిల్చిన వారిలో ఒకరు గోపరాజు రమణ. ఇతని పేరు చెప్తే ఎవ్వరికీ తెలియకపోవచ్చేమో, కానీ ముఖం చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తు పట్టని వారంటూ ఉండరు.
అంత పాపులారిటీ ని సంపాదించాడు ఈయన. 2004 వ సంవత్సరం లోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అవకాశాల కోసం ఎదురు చూసాడు. పలు సినిమాల్లో ఇతనికి దర్శకనిర్మాతలు చిన్న చిన్న వేషాలు ఇచ్చేవారు. అయితే ఆ క్యారెక్టర్స్ గోపరాజు కి ఎలాంటి ఫేమ్ తెచ్చిపెట్టలేకపోయాయి. అయినప్పటికీ కూడా ఆయన సినిమా ఇండస్ట్రీ ని వదిలిపెట్టలేదు. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే, మరోపక్క అవకాశాలు వచ్చినప్పుడల్లా సినిమాల్లో నటించేవాడు. అలా ఈయనకు ఆనంద్ దేవరకొండ తో చేసిన ‘మిడిల్ క్లాస్ మెమొరీస్’ అనే చిత్రంలో తండ్రి పాత్ర పోషించే అవకాశం దక్కింది. ఈ సినిమాలో గోపరాజు నటుడిగా తన విశ్వరూపం చూపించాడు అనే చెప్పాలి. నవ్వించాల్సిన సమయంలో నవ్విస్తూనే, బాధ పడాల్సిన సన్నివేశాలు వచ్చినప్పుడు ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాడు. అంతటి అద్భుతమైన నటన ప్రతిభ ఉన్న ఆర్టిస్టు ఈయన. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘క్రాక్’, ‘మహా సముద్రం’, ‘స్వాతి ముత్యం’, ‘ఎఫ్ 3’, ‘వీర సింహా రెడ్డి’ , ‘బెదురులంక’ ఇలా ఒక్కటా రెండా ఎన్నో సినిమాల్లో నటించి మంచి నటుడిగా పేరు తెచ్చుకొని బిజీ ఆర్టిస్టుగా మారిపోయాడు. గత ఏడాది ఈయన టాలీవుడ్ లో ఏకంగా 12 సినిమాల్లో నటించాడు.
ఈ ఏడాది ఈయన నటించిన సినిమాలు ఇప్పటి వరకు 8 విడుదల అయ్యాయి. 72 ఏళ్ళ వయస్సులో గోపరాజు కి ఈ స్థాయిలో సినిమా అవకాశాలు రావడం అనేది చిన్న విషయం కాదు. ఇదంతా పక్కన పెడితే గోపరాజు రమణకు ఒక గోపరాజు విజయ్ అనే కొడుకు ఉన్నాడు. ఈయన కూడా తన తండ్రిలాగానే రంగస్థలం చిన్నతనంలో రంగస్థలం నాటక ప్రదర్శనలు వేసేవాడు. ఇప్పటి వరకు ఆయన ‘గుంటూరు కారం’, ‘సామజవరగమనా’, ‘బృందా’ ఇలా ఎన్నో చిత్రాలలో నటించాడు. ఆయనకీ సంబంధించిన ఫోటోని క్రింద అందిస్తున్నాము చూడండి. విశేషం ఏమిటంటే కొదుకుకంటే తండ్రికే ఇప్పటికీ ఎక్కువ వసూళ్లు రావడమే. భవిష్యత్తులో వీళ్లిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుందో చూడాలి.