Rajamouli : ఇక రాజమౌళి లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి. మరి ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే ఆయన ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. సినిమాల గురించి అనుక్షణం పరితపిస్తూ ఆ సినిమా మీద భారీ ఎఫర్ట్ పెట్టడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కాబట్టే ఆయనకు మంచి విజయాలు దక్కుతున్నాయి. అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం ఆయన విషయంలో చాలా గొప్పగా చెబుతూ ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి మంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు సైతం ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి రాజమౌళితో వాళ్లు సినిమా చేయాలని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎన్ని సినిమాల్లో చేసిన రాని గుర్తింపు రాజమౌళితో ఒక్క సినిమా చేస్తే మంచి గుర్తింపురావడమే కాకుండా ఆ హీరో కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ కూడా ఏర్పడుతుంది. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ఇంతవరకు ఏ సినిమాలో కూడా పెద్దగా కనిపించలేదు. ఆయన మంచి నటుడు అయినప్పటికి ఆయనకి తన సినిమాలను మినహాయిస్తే మిగిలిన ఏ సినిమాల్లో కూడా ఆయన నటించడానికి పెద్దగా ఆసక్తి అయితే చూపించలేదు. ఆయన సినిమాల్లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ అయితే పోషించలేదు…
ఇక ఇదిలా ఉంటే రాజమౌళి పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో సైడ్ డాన్సర్ గా నటించాడు అంటూ కొన్ని వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక బంగారం సినిమాలోని టైటిల్ సాంగ్ అయిన ‘రా రా రారా బంగారం’ అనే సాంగ్ లో పవన్ కళ్యాణ్ రఘుబాబు పక్కన రాజమౌళి కూడా ఉన్నట్టుగా ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
ఇంకా ఈ ఫోటోని చూసిన చాలామంది పవన్ కళ్యాణ్ బంగారం సినిమా చేస్తున్న సమయంలో రాజమౌళి పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. దానికి సంబంధించిన కథను చెప్పడానికి బంగారం సెట్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ రాజమౌళి ఉండడంతో అతన్ని సైడ్ డాన్సర్ గా వాడేసారు అంటూ కొంతమంది కొన్ని కథనాలను వెలువరిస్తున్నారు.
అయితే అందులో ఎంతవరకు నిజం ఉంది రాజమౌళి లుక్స్ తో ఉన్న మరొక వ్యక్తి నటించాడా లేదంటే రాజమౌళి గారే చేశారా అనే విషయాన్ని మాత్రం ఎవ్వరు క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. మరి ఈ విషయం మీద రాజమౌళి స్పందిస్తే తప్ప దీనికి సరైన సమాధానం అయితే దొరకదు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…