https://oktelugu.com/

Rajamouli and Allu Arjun : రాజమౌళి చేయబోయే మహాభారతం సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఏంటో చెప్పేసిన జక్కన్న…పండగ చేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు వాళ్ళ స్టామినాని చూపిస్తూ భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇప్పటివరకు వాళ్ళు సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట రాబోయే సక్సెస్ లు మరొక ఎత్తుగా మారబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మన హీరోల స్టార్ డమ్ అనేది ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా విస్తరించింది.

Written By:
  • Gopi
  • , Updated On : December 28, 2024 / 08:19 AM IST

    Allu Arjun , Rajamouli

    Follow us on

    Rajamouli and Allu Arjun : ప్రస్తుతం రాజమౌళి కి ఇండియా లో చాలా మంచి క్రేజ్ ఉంది…ఇక ఆ క్రేజ్ ను కాపాడుకోవాలంటే మంచి సినిమాలు చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ తో పాటు హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూసే సమయం అయితే ఆసన్నమైంది. మరి ఇలాంటి సందర్భంలో రాజమౌళి చేయబోయే సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. దాదాపు 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో పాటుగా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం సినిమాని కూడా తొందర్లోనే లైన్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమా కోసం ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరిని ఏకం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించడానికి ప్రతి ఒక్క హీరో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆయనకు ఏ హీరో కావాలంటే ఆ హీరో ఈజీగా అతనితో సినిమాలు చేసే అవకాశాలైతే ఉన్నాయి.

    ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు రాజమౌళి అల్లు అర్జున్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇక మహాభారతం సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్న నేపధ్యం లో అల్లు అర్జున్ కూడా ఆ సినిమాలో ఒక భాగం కాబోతున్నట్టుగా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

    మరి మొత్తానికైతే ఆయనకు ఎలాంటి క్యారెక్టర్ ని ఇవ్వబోతున్నాడనే దాని మీద ఆయన సరైన క్లారిటీ ఇవ్వలేకపోయాడు. కానీ పాండవుల్లో ఒకరిగా మాత్రం ఉండబోతున్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి అందుతున్న సమాచారం ప్రకారం అయితే అర్జునుడి గా అల్లు అర్జున్ ను చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

    మరి ఏది ఏమైనా కూడా ఈ ప్రాజెక్టు కోసం యావత్ ఇండియన్ సినిమా జనాలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి రాజమౌళి ఈ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడనేది ఒక మిస్టరీగా మారింది. ఇక ఈ సినిమాను చేసి తనను తాను ప్రూవ్ చేసుకోవడమే కాకుండా మన హిందువుల పవిత్ర గ్రంథం అయిన మహాభారతం గురించి యావత్ ప్రపంచానికి ఎలుగెత్తి చెప్పాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలాంటి ఒక సాహసాన్ని చేస్తున్నట్టుగా తెలుస్తోంది…