Pawan Kalyan Shirt Price: కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తనకు ఓజీ(They Call Him OG) లాంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందించిన సుజిత్ కి ఒక ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోలను డైరెక్టర్ సుజిత్ సోషల్ మీడియా లో షేర్ చేసుకొని ఆనందపడ్డాడు. అయితే ఈ ఫోటోలలో పవన్ కళ్యాణ్ లుక్స్ ని చూసి అభిమానులు కంగుతిన్నారు. అసలు ఈ ఫోటోలలో కనిపిస్తున్నది పవన్ కళ్యాణ్ యేనా?, ఆయన లుక్స్ ఏంటి ఇలా ఉన్నాయి?, కటింగ్ ఎందుకు అలా చేయించుకున్నాడు?, గత కొంతకాలం నుండి ఆయన్ని ఈ వెరైటీ గెటప్ లో మనం చూస్తూనే ఉన్నాం. షూటింగ్ లేని సమయం లో ఇష్టమొచ్చినట్టు జుట్టు, గెడ్డం పెంచుకొని తిరిగే పవన్ కళ్యాణ్ , ఇప్పుడు మిలటరీ ఆఫీసర్ లాగా లుక్స్ ని ఎందుకు మైంటైన్ చేస్తున్నాడు?, ఏదైనా కొత్త సినిమాకు సంబంధించిన లుక్ టెస్ట్ కోసం ఇలా మ్యానేజ్ చేస్తున్నాడా?, అసలు పవర్ స్టార్ కి ఏమైంది అటు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే నేడు పవన్ కళ్యాణ్ ధరించిన చొక్కా అభిమానుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. ఈ చొక్కా విలువ ఎంతో తెలుసుకొని కొనేందుకు ఫ్యాన్స్ గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు. అలా చేసిన తర్వాత ఆ చొక్కా ధర తెలుసుకొని వాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ చొక్కా పేరు ‘Polo Ralph Lauren’. దీని ధర అక్షరాలా 22 వేల 500 రూపాయిలు. ఒక మధ్య తరగతి కుటుంబం నెల మొత్తం ఈ డబ్బులతో ఎలాంటి చింత లేకుండా బ్రతికేయొచ్చు అన్నమాట. చూసేందుకు చాలా సింపుల్ గా కనిపిస్తుంది కానీ, ఈ రేంజ్ రేట్ అయితే మన లాంటి సామాన్యులు ఎవరు కొంటారు చెప్పండి, కేవలం సినీ సెలబ్రిటీలు , లేదా బాగా ఆస్తులు ఉన్న రాజకీయ నాయకులూ మాత్రమే కొనగలరు.
అయితే పవన్ కళ్యాణ్ ఇలాంటి లుక్ లో కనిపించడం పై సోషల్ మీడియా లో ట్రోల్స్ మామూలు రేంజ్ లేవు. ‘ఒడియామా బంటి’ అంటూ ఒక రేంజ్ లో వెక్కిరిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ లుక్స్ పై కామెంట్స్ చేయడం సమయం వృధా అని విశ్లేషకులు చెప్పే మాట. ఎందుకంటే కుంభమేళా సమయం లో ఫ్యామిలీ ప్యాక్ అంటూ ఇలాగే ట్రోల్ చేశారు. కట్ చేస్తే కేవలం రెండు నెలల్లోనే సన్నబడి, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో ఏ రేంజ్ లో కనిపించదు మనమంతా చూసాము. కాబట్టి మళ్లీ షూటింగ్ మొదలు దగ్గర్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మరోసారి స్లిమ్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదు అంటూ విశ్లేషకులు అంటున్నారు.