Amazing phones under 7000: మొబైల్ కావాలని అనుకున్న వారు కొందరు అధిక ధరకు.. మరికొందరు తక్కువ ధరలో ఉండే వాటిని కొనుగోలు చేస్తారు. అయితే చాలావరకు ఇటీవల ప్రీమియం మొబైల్స్ గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో చర్చ సాగుతూ ఉంటుంది. కానీ తక్కువ ధరలో ఉండే మొబైల్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ కంపెనీలు ఆకట్టుకునే ఫీచర్లతో అద్భుతమైన స్పీడుతో తక్కువ ధరలోనే మొబైల్స్ ను అందిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో రూ.7000 కంటే తక్కువగా వచ్చే మొబైల్స్ ఏమీ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల మొబైల్స్ ఉన్నప్పటికీ.. Itel, Infinix, Lava వంటి కంపెనీలు సాధారణ వినియోగదారులకు అతి తక్కువ ధరలో మొబైల్ స్పందిస్తున్నాయి. వీటిలో లావా కంపెనీకి చెందిన O3 అనే మొబైల్ ధర రూ.5,949 గా ఉంది. ఇందులో 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉండనుంది. అలాగే 4gb రామ్ తో పనిచేస్తుంది. అయితే ఎక్స్టర్నల్ గా 8 జిబి వరకు పెంచుకోవచ్చు. ఇది 6.75 అంగుళాల HD డిస్ప్లే తోపాటు 60 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఇది బాగా ఆకట్టుకుంటుంది. ఈ మొబైల్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
మరో కంపెనీ ఐటెల్ కు చెందిన జెనో 20 ధర రూ.6,639 గా ఉంది. ఇందులో 6.6 అంగుళాల HD డిస్ప్లే తో పాటు acta core ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు 4gb రామ్ తో పనిచేస్తుంది. కెమెరా కోసం ఇందులో 13 మెగాపిక్సల్ నువ్వు అమర్చారు. సెల్ఫీల కోసం 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 15 వాట్ ఫాస్ట్ చార్జర్ తో పనిచేసే ఇందులో 5000 mah బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.
ఇన్ఫినిక్స్ 9 HD అనే మొబైల్ సైతం తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇది మార్కెట్లో రూ.6,699 తో విక్రయిస్తున్నారు. 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు 3gb రామ్ తో పనిచేసే ఇందులో 5000 mah బ్యాటరీని అమర్చారు. 6.7 అంగుళాల HD డిస్ప్లే తో ఆకట్టుకుంటుంది. కెమెరా కోసం ఇందులో 13 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాలు అమర్చారు.
ఇలా తక్కువ ధరలో లేదా అదనంగా మొబైల్ కొనాలని అనుకునే వారికి ఇవి ఆకట్టుకుంటున్నాయి. తక్కువ ధరలో ఎన్నో రకాల మొబైల్స్ అందుబాటులో ఉన్నప్పటికీ ఈ కంపెనీలకు చెందిన ఫోన్లు అత్యధిక లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లతో పాటు బ్యాటరీ, కెమెరా సామర్ధ్యాలు ఎక్కువగా ఉంటాయి