Chikiri Chikiri 100M views: ‘గేమ్ చేంజర్’ డిజాస్టర్ తో డీలాపడిన రామ్ చరణ్(Global Star Ram charan) ఫ్యాన్స్ ని, మళ్లీ మంచి ఫార్మ్ లోకి తీసుకొచ్చిన చిత్రం ‘పెద్ది'(Peddi Movie). ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమాపై మార్కెట్ లో మామూలు రేంజ్ క్రేజ్ లేదు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ కంటెంట్ ఆటం బాంబు లాగా పేలింది. ముందుగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. IPL సమయం లో ఎక్కడ చూసిన ఈ వీడియో నే కనిపించేది. జాతీయ స్థాయిలో పెద్ది షాట్ మంచిగా వైరల్ అయ్యింది. ఇక ఈమధ్య కాలం లో విడుదల చేసిన ‘చికిరి..చికిరి'(Chikiri Chikiri) పాటకు అయితే గ్లోబల్ వైడ్ గా రీచ్ వచ్చింది. ఎక్కడ చూసినా ఈ పాటనే వినిపిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో అయితే నెటిజెన్స్ పోటీ పడి మరీ రీల్స్ చేస్తున్నారు.
ఇక యూట్యూబ్ లో అయితే ‘చికిరి..చికిరి’ తెలుగు వెర్షన్ నేడు 100 మిలియన్ వ్యూస్ మార్కుని అందుకొని సంచలనం సృష్టించింది. మన టాలీవుడ్ లో ఒక పాటకు విడుదలైన నెల రోజుల్లోనే 100 మిలియన్ కి పైగా వ్యూస్ రావడం గతంలో ఎప్పుడూ జరగలేదు. కేవలం ‘చికిరి..చికిరి’ విషయం లో మాత్రమే జరిగింది. అంతే కాదు, ఈ పాటకు సంబంధించిన అన్ని వెర్షన్స్ కలిపి 150 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయట. ముఖ్యంగా హిందీ వెర్షన్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. నార్త్ ఇండియన్స్ అంత తేలికగా ఒక పాటకు కనెక్ట్ అవ్వరు. అయితే ఈ రేంజ్ కి తీసుకెళ్లి పెడుతారు. ఇప్పటి వరకు ఈ పాటకు కేవలం హిందీ వెర్షన్ నుండి 37 మిలియన్ కి పైగా వ్యూస్ వస్తున్నాయి. ప్రతీ రోజులకు యావరేజ్ గా ఈ పాటకు 1 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఏ పాన్ ఇండియన్ సినిమాకు కూడా ఇలా జరగలేదు.
రాబోయే రోజుల్లో ఈ పాట ఇంకా ఎన్ని రికార్డ్స్ ని నెలకొల్పుతుందో చూడాలి. ఒక్కమాటలో చెప్పాలంటే పుష్ప చిత్రానికి, ఆ చిత్రం లోని పాటలకి ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో, ‘పెద్ది’ చిత్రానికి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తోంది. కానీ ఇక్కడ ఒక్కటే తేడా, పుష్ప చిత్రానికి విడుదల తర్వాత గుర్తింపు వస్తే, పెద్ది చిత్రానికి విడుదలకు ముందే గుర్తింపు వచ్చింది. ఇదే ఊపు ని కొనసాగిస్తూ పోతే, పుష్ప 2 చిత్రానికి బాలీవుడ్ లో ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయో , పెద్ది కి అంతకు మించిన కలెక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెగా అభిమానులు మరియు రామ్ చరణ్ అభిమానుల ఆకలి మొత్తం ఈ చిత్రం తో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా రేంజ్ ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది.