spot_img
Homeఎంటర్టైన్మెంట్Shakeela Remuneration: ఉంది రెండు వారాలే కానీ... షకీలాకు ఎన్ని లక్షలు ఇచ్చారో తెలిస్తే షాక్...

Shakeela Remuneration: ఉంది రెండు వారాలే కానీ… షకీలాకు ఎన్ని లక్షలు ఇచ్చారో తెలిస్తే షాక్ అవుతారు!

Shakeela Remuneration: నటి షకీలా బిగ్ బాస్ జర్నీ రెండు వారాలకే ముగిసింది. టాప్ సెలెబ్స్ లో ఒకరిగా ఉన్న షకీలా నిష్క్రమణ ఊహించనిదే. ఒకప్పుడు శృంగార చిత్రాలతో సౌత్ ఇండియాను ఊపేసిన షకీలా అంటే తెలియనివారుండరు. 90లలో ఆమె మలయాళ చిత్ర పరిశ్రమను ఏలారు. ఆమె చిత్ర విడుదల ఉంటే మోహన్ లాల్, మమ్ముట్టి వంటి స్టార్స్ కూడా తమ చిత్రాలు వాయిదా వేసుకునేవారట. కెరీర్లో 500కి పైగా చిత్రాల్లో నటించిన షకీలా టాప్ సెలెబ్స్ లో ఒకరిగా హౌస్లో అడుగుపెట్టారు. షకీలా తనదైన మార్క్ వేస్తుందని అందరూ భావించారు. అందరి అంచనాలు తలక్రిందలు చేస్తూ షకీలా త్వరగా ఎలిమినేట్ అయ్యింది.

షకీలా ఎలిమినేషన్ కి కారణాలు పరిశీలిస్తే… ఆమె వయసురీత్యా యాక్టివ్ గా ఉండటం లేదు. ఆ విషయాన్ని పదే పదే చెప్పడం కూడా మైనస్ అయ్యింది. తనకు వయసైపోయింది, నా నుండి ఎక్కువ ఆశించవద్దని ఆమె చెప్పకనే చెబుతుంది. ఆ విషయాన్ని సింపథీగా వాడుకోవాలని చూసింది. దానికి తోడు ఆమె వివాదాలకు దూరంగా ఉన్నారు. శివాజీతో పాటు ఒకరిద్దరితో రిలేషన్ మైంటైన్ చేశారు.

ప్రేక్షకుల్లో షకీలా పట్ల ఎలాంటి అభిప్రాయం ఏర్పడలేదు. అందుకే ఓట్లు వేయకుండా లైట్ తీసుకున్నారు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ నుండి తప్పించుకున్న షకీలా సెకండ్ వీక్లో దొరికిపోయారు. ఈ వారానికి మొత్తం 9 మంది నామినేట్ అయ్యారు. శివాజీ పవర్ అస్త్ర గెలిచిన కారణంగా ఎలిమినేషన్ నుండి తప్పుకున్నాడు. అమర్ దీప్, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ వరుసగా సేవ్ అవుతూ వచ్చారు.

డేంజర్ జోన్లో తేజా, షకీలా మిగిలారు. ఇద్దరినీ ఆక్టివిటీ రూమ్ కి పిలిచిన నాగార్జున ఎవరి ఫోటో వస్తుందో వాళ్ళు సేఫ్… మిగిలినవారు ఎలిమినేట్ అన్నారు. తేజా ఫోటో రావడంతో అతడు సేవ్ అయ్యాడు. షకీలా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. షకీలా ఎలిమినేషన్ తో ఇంటి సభ్యులు కొందరు ఎమోషనల్ అయ్యారు. వేదికపై కూడా షకీలా కన్నీరు పెట్టుకుంది. నాగార్జున ఇచ్చిన టాస్క్ ముగించి వెళ్ళిపోయింది.

హౌస్లో ఉంది రెండు వారాలే అయినా… షకీలా చెప్పుకోదగ్గ రెమ్యూనరేషన్ పొందారని సమాచారం. వారానికి రూ. 3.5 నుండి 4 లక్షల ఒప్పందంతో ఆమె హౌస్లో అడుగుపెట్టారట. కాబట్టి ఆమెకు రూ. 7 నుండి 8 లక్షల రెమ్యూనరేషన్ దక్కింది. గతంలో షకీలా కన్నడ బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. అక్కడ కూడా ఆమె సక్సెస్ కాలేదు. 27వ రోజు ఎలిమినేట్ అయ్యారు. షకీలా ఎలిమినేషన్ తో ఆమె ఫ్యాన్స్ ఒకింత నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper
Exit mobile version