Shakeela Comments On Venumadhav: సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టుల మధ్య సన్నిహిత సంబంధాలైతే ఉంటాయి. ఒక సినిమాలో నటించే నటీనటులు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. నటన విషయంలో గాని, ఇతర విషయాల్లో గాని సపోర్ట్ చేసుకుంటూ సినిమాలను చేస్తుంటారు… ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు వేణు మాధవ్… బ్రహ్మానందం, ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ లాంటి కమెడియన్స్ టాప్ పొజిషన్లో ఉన్న సమయంలో వేణుమాధవ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక వాళ్ల పోటీని తట్టుకొని నిలబడడం అంటే ఆషామాషీ వ్యవహారమైతే కాదు. కానీ వేణు తన ఓన్ స్టైల్ ని వాడుతూ డిఫరెంట్ మేనరిజమ్స్ తో కామెడీని జనరేట్ చేస్తూ ఉండేవాడు. ఇక అది చూసే ప్రేక్షకులకు సైతం ఫోర్సెడ్ కామెడీ లా కాకుండా చాలా జెన్యూన్ గా అనిపించేది. అందువల్లే ఆయన ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు తన కెరీర్ ని కొనసాగించగలిగాడు… 2019 వ సంవత్సరంలో అనారోగ్య కారణంగా ఆయన మృతి చెందిన విషయం మనకు తెలిసిందే… ఇక వేణుమాధవ్ లేని లోటు ఇండస్ట్రీ లో ఎవ్వరు తీర్చలేరనేది… ఆయన తన తోటి ఆర్టిస్టులకు సైతం చాలా వరకు హెల్ప్ ఫుల్ గా ఉండేవారట. తనతో పని చేసిన చాలామంది ఈ విషయాన్ని చెబుతూ ఉంటారు… ఇక బోల్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన షకీలా సైతం వేణుమాధవ్ కాంబినేషన్లో కొన్ని సినిమాల్లో అయితే నటించింది… సినిమా షూటింగ్లో భాగంగా వీళ్ళు అవుట్ డోర్ షూట్ కి వెళ్ళినప్పుడు షకీలా తనకిచ్చిన రూమ్ అంత కంఫర్ట్ గా లేకపోవడంతో తన పక్క రూమ్ లో ఉంటున్న వేణుమాధవ్ దగ్గరికి వెళ్లిందట. నా రూమ్ లో అంత కంఫర్ట్ గా లేదు. నేను ఈరోజు నీ రూమ్ లో పడుకుంటానని వేణుమాధవ్ ను అడిగిందట. దానికి వేణుమాధవ్ సైతం పడుకోండి అని చెప్పాడట… ఇక సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉందట…అందుకే షకీలా చాలా ధైర్యం గా తన రూమ్ లో పడుకోవాలని నిర్ణయించుకుంది.
ఆమె బెడ్ మీద పడుకొని ఏదో ఆలోచిస్తున్న క్రమంలో వేణుమాధవ్ లేచి ఏదో చేస్తున్నట్టుగా తనకు ఒక షాడో అయితే కనిపించిందట. వెంటనే తను లేచి ఏం చేస్తున్నావ్ వేణుమాధవ్ అని అడగగా, నేను నిన్ను ఒకటి అడుగుతాను నువ్వేం అనుకోవు కదా అని అన్నాడట. ఏమీ అనుకోను అని చెప్పినప్పటికి మనసులో మాత్రం ఈయన ఏం అడుగుతాడో అని ఒక చిన్న కలవరం అయితే మొదలైందట.
మొత్తానికైతే వేణుమాధవ్ బెడ్డు మధ్యలో దిండులు పెడుతుంటే అదంతా చూస్తున్న షకీలా మాత్రం ఇదంతా దేనికి అని అడిగిందట. దాంతో వేణుమాధవ్ నాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు పొరపాటున రాత్రి నీ చెయ్యి కానీ కాలు కానీ తగిలితే నా బతుకు ఏమైపోవాలి.
ఆ దెబ్బకి నా ప్రాణం పోయినా పోతుంది అంటూ ఆయన ఫన్నీగా ఆన్సర్ అయితే ఇచ్చారట. దాంతో షకీలా ఆ నైట్ మొత్తం నవ్వుకుంటూనే ఉందట. అలా వేణుమాధవ్ చాలా కామెడీగా ఉంటాడని ఆమె ఒక ఇంటర్వ్యూ లో తెలియజేసింది. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…