Jayam Child Artist: జయం సినిమాలో సదా చెల్లెలు.. ఇప్పుడు చూస్తే మతి పోవాల్సిందే..!

సదా చెల్లెలి పాత్రలో కనిపించిన అమ్మాయి సైతం తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలో రివర్స్ లో రాసే అమ్మాయి పాత్ర కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Written By: Suresh, Updated On : December 29, 2023 2:18 pm

Jayam Child Artist

Follow us on

Jayam Child Artist: టాలీవుడ్ లో వచ్చిన అందమైన లవ్ స్టోరీ ‘జయం’. జూన్ 14, 2002లో వచ్చిన ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సదాతో పాటు ప్రతినాయకుడి పాత్రలో కనిపించిన గోపీచంద్ కూడా తమ నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. హీరో నితిన్ అమాయకత్వం, పక్కింటి అమ్మాయిలా సదా, విలన్ పాత్ర పోషించిన గోపీచంద్ నటన తో పాటు ఆర్పీ పట్నాయక్ సంగీతం ఇలా సినిమాలో ప్రతి ఒక్కటి ప్రత్యేకమే. ఈ సినిమాలో ఎంతో మంది ప్రధాన పాత్రల్లో కనిపించగా సదా చెల్లి పాత్ర కూడా సినిమాలో కీలకమనే చెప్పుకోవచ్చు.

సదా చెల్లెలి పాత్రలో కనిపించిన అమ్మాయి సైతం తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలో రివర్స్ లో రాసే అమ్మాయి పాత్ర కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతేకాదు ఈ మూవీలో తన నటనతో ఏకంగా నంది అవార్డును సైతం అందుకుంది. జయం సినిమా వచ్చి దాదాపు 20 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఆ అమ్మాయిని ఎవరు మర్చిపోలేదంటే ఎంతగా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించిందో అర్థం అవుతుంది.. ఆ అమ్మాయి పేరు యామిని శ్వేతా..ప్రముఖ సీరియల్ ఆర్టిస్ట్ జయలక్ష్మీ కూతురు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన చిన్నది ఇప్పుడెలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే.

Jayam Child Artist

యామిని శ్వేతకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జయం సినిమా తరువాత ఉత్సాహం, అనగనగా ఓ కుర్రాడు వంటి మూవీల్లో నటించింది. ఆ తరువాత సినిమాలకు దూరమైన ఈ అమ్మడు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిపోయింది. చదువు కంప్లీట్ అయిన తరువాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఆస్వాదిస్తున్న యామిని శ్వేతకు పాప కూడా ఉంది. ప్రస్తుతం ఆమె ఫొటోలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి.