https://oktelugu.com/

Animal OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతున్న సెన్సేషనల్ యానిమల్… డేట్ ఎప్పుడంటే?

మిశ్రమ స్పందన దక్కించుకున్న యానిమల్ భారీ వసూళ్లు రాబట్టింది. రన్బీర్ కపూర్ కెరీర్ హైయెస్ట్ నమోదు చేశాడు. వరల్డ్ వైడ్ యానిమల్ రూ. 900 కోట్ల వరకు వసూలు చేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : December 29, 2023 / 02:12 PM IST

    Animal OTT

    Follow us on

    Animal OTT: దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో అడుగుపెట్టి సెన్సేషన్స్ సృష్టిస్తున్నాడు. ఆయన బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ఇచ్చాడు. ఆయన తెరకెక్కించిన హిందీ చిత్రాలు కబీర్ సింగ్, యానిమల్ బ్లాక్ బస్టర్ కొట్టాయి. ఈ రెండు చిత్రాలపై విపరీతమైన చర్చ నడిచింది. సాంప్రదాయవాదులు విమర్శలు చేశారు. యానిమల్ అయితే మరీ దారుణం. ఈ సినిమా కంటెంట్ సమాజానికి ప్రమాదం అని కాంగ్రెస్ మహిళా ఎంపీ ఒకరు పార్లమెంట్ లో వాదించారు.

    మిశ్రమ స్పందన దక్కించుకున్న యానిమల్ భారీ వసూళ్లు రాబట్టింది. రన్బీర్ కపూర్ కెరీర్ హైయెస్ట్ నమోదు చేశాడు. వరల్డ్ వైడ్ యానిమల్ రూ. 900 కోట్ల వరకు వసూలు చేసింది. నెగిటివ్ పబ్లిసిటీ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. అంతగా విమర్శల పాలవుతున్న ఈ చిత్రంలో ఏముందో చూడాలని కూడా జనాలు థియేటర్స్ కి క్యూ కట్టారు. యానిమల్ చిత్ర నిడివి 3:21 నిమిషాలు. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద సినిమా రాలేదు.

    సుదీర్ఘ నిడివి కారణంగా యానిమల్ చాలా వసూళ్లు కోల్పోయింది. ఎక్కువ షోలు పడలేదు. నిర్మాతలు చెప్పినా యానిమల్ చిత్ర నిడివి తగ్గించడం కుదరదని సందీప్ రెడ్డి వంగ అన్నారట. యానిమల్ చిత్ర థియేట్రికల్ రన్ ముగిసింది. దీంతో ఓటీటీ విడుదలకు రంగం సిద్ధం అవుతుంది.

    యానిమల్ చిత్ర ఓటీటీ హక్కులు నెట్ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి దక్కించుకుంది. జనవరి 26 నుండి యానిమల్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుందని సమాచారం. అధికారికంగా డేట్ ప్రకటించాల్సి ఉంది. ఓటీటీ వెర్షన్ లో మరికొన్ని సన్నివేశాలు జోడించే అవకాశం కలదు. కొత్త సన్నివేశాలతో విడుదల చేయాలంటే మరోసారి సెన్సార్ కి వెళ్ళాలట. అందుకే ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ చెప్పాడు.