https://oktelugu.com/

Pushpa 2 : పుష్ప 2 మూవీ కి పెట్టిన టిక్కెట్ రేట్లు బాహుబలి 2 కి పెట్టి ఉంటే ఆ సినిమా ఎంత వసూళ్లను కలెక్ట్ చేసేదో తెలుసా..?

ఇండియన్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు రాజమౌళి లాంటి దర్శకుడు మరొకరు లేరని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Written By:
  • Gopi
  • , Updated On : December 18, 2024 / 01:23 PM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2 : ఇండియన్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు రాజమౌళి లాంటి దర్శకుడు మరొకరు లేరని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాశిస్తున్న దర్శకుడిగా ఆయనకు ఒక మంచి గుర్తింపైతే ఉంది. మరి ఆయన సాధించిన విజయాల గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడకున్న తక్కువే అవుతుంది… ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ డైరెక్టర్ గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక అందులో భాగంగానే తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో అరుదైన రికార్డుని సాధించిన బాహుబలి 2 సినిమాకి చాలా ప్రత్యేకత ఉంది. అయితే ఈ సినిమా 2017 వ సంవత్సరంలోనే వచ్చి 19 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది… ఇక ఇప్పటివరకు చాలా సినిమాలు ఈ రికార్డును బ్రేక్ చేయాలనే ప్రయత్నం చేసినప్పటికి అవి ఏవి కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోతున్నాయి. కారణం ఏదైనా కూడా ఈ సినిమా సాధించినది మాత్రం మామూలు విజయం కాదు… రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడు తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా ఈ రికార్డును బ్రేక్ చేసే దిశగా ముందుకు దూసుకెళ్తుంది. 1500 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టిన పుష్ప 2 సినిమా మరి కొద్ది రోజుల్లో బాహుబలి 2 సినిమా రికార్డును బ్రేక్ చేస్తుంది అంటూ కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి… ఇక ఇదంతా చూసిన రాజమౌళి అభిమానులు గాని ప్రభాస్ అభిమానులు గాని కొన్ని వాక్యాలు అయితే చేస్తున్నారు.

    అవి ఏంటి అంటే రాజమౌళి తీసిన ‘బాహుబలి 2’ సినిమా 2017 వ సంవత్సరంలో రిలీజ్ అయింది. అప్పటికి సినిమా టిక్కెట్ల రేటు 100 నుంచి 150 మాత్రమే ఉంది. కానీ పుష్ప 2 సినిమాకి 1000 రూపాయలకు పైన టిక్కెట్ రేట్లను పెట్టారు. అయినప్పటికీ ఆ సినిమా బాహుబలి 2 సినిమా రికార్డ్ ను బ్రేక్ చేయడానికి చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంది…

    ఒకవేళ బాహుబలి 2 సినిమాకి ఈ రేట్లు కనక పెట్టినట్టైతే రాజమౌళి అప్పుడే ఈ సినిమాతో 4000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టేవాడు అంటూ ప్రేక్షకులు కూడా కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. మరి ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిందనే చెప్పాలి.

    మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న పుష్ప 2 సినిమా బాహుబలి 2 సినిమా రికార్డును బ్రేక్ చేసిన కూడా అంత పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరమైతే లేదు అంటూ సగటు ప్రేక్షకులు వాళ్ళ కామెంట్లను తెలియజేయడం విశేషం…ఇక మొత్తానికైతే రాజమౌళి విజన్ కి అందరూ ఫీదా అవుతున్నారు. ఆయన అప్పుడే దాదాపు 2000 కోట్ల కలెక్షన్లు రాబట్టాడు అంటే మామూలు విషయం కాదు అంటూ రాజమౌళి మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు…