https://oktelugu.com/

Manchu Vishnu and Prabhas : ఆ ఒక్క విషయం లో తేడా వస్తే ఊరుకోను అంటూ మంచు విష్ణు కి ప్రభాస్ స్ట్రాంగ్ వార్నింగ్!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో ఒకటి 'కన్నప్ప'. మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తన డ్రీం ప్రాజెక్ట్ గా భావించి ఈ చిత్రాన్ని చేస్తున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : December 18, 2024 / 12:30 PM IST

    Manchu Vishnu , Prabhas

    Follow us on

    Manchu Vishnu and Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో ఒకటి ‘కన్నప్ప’. మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తన డ్రీం ప్రాజెక్ట్ గా భావించి ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ శివుడి క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు. ఆయన పాత్రలో ఈ సినిమాలో 20 నుండి 30 నిమిషాల వరకు ఉంటుంది. ఆయన పాత్రకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. కేవలం ప్రభాస్ మాత్రమే కాదు, బాలీవుడ్ నుండి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుండి మోహన్ లాల్, శాండిల్ వుడ్ నుండి శివ రాజ్ కుమార్ వంటి సూపర్ స్టార్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. దాదాపుగా అందరి లుక్స్ విడుదల అయ్యాయి కానీ, ప్రభాస్ మరియు అక్షయ్ కుమార్ లుక్స్ ని మాత్రం ఇంకా విడుదల చేయలేదు. ప్రస్తుతానికి సస్పెన్స్ గా పెట్టిన వీళ్లిద్దరి లుక్స్ అతి త్వరలోనే విడుదల చేయనున్నారు మేకర్స్.

    ఇదంతా పక్కన పెడితే లుక్స్ విషయం లో ప్రభాస్ చాలా కచ్చితమైన కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. దేవుడి లుక్ లో కనిపించబోతుండడంతో సహజత్వం కోల్పోకుండా, చూడగానే దైవత్వం ఉట్టిపడేలా ఉండాలని మంచు విష్ణు కి, మేకర్స్ కి పదే పదే చెప్పాడట. ఎందుకంటే అప్పటికే ఆయన ‘ఆదిపురుష్’ చిత్రం విషయం లో నేషనల్ వైడ్ గా ట్రోల్స్ ఎదురుకున్నాడు. శ్రీ రాముడి వేషధారణ ఇలా ఉంటుందా?, బ్రాహ్మణుడైన రావణుడిని మాంసాహారిగా చూపిస్తారా అంటూ దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు మండిపడ్డాయి. అందుకే మళ్ళీ అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలని కన్నప్ప మేకర్స్ కి చాలా స్ట్రిక్ట్ గా చెప్పాడట ప్రభాస్. అందుకే మేకర్స్ ప్రభాస్ లుక్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ద చూపించారు. ఇటీవలే షూటింగ్ లొకేషన్ లో ఆయన లుక్ కి సంబంధించిన చిన్న మేకింగ్ ఫోటో విడుదలై వైరల్ అవ్వడంతో మంచు విష్ణు చాలా ఫైర్ అయ్యాడు. అతనిపై యాక్షన్ తీసుకొని, అతని చేత క్షమాపణలు చెప్పించి వీడియో విడుదల చేయించాడు.

    ఈ సినిమా నుండి ఎలాంటివి లీక్ చేసినా కఠిన చర్యలు తప్పవని, వాటిని సోషల్ మీడియా లో షేర్ చేసే వాళ్లపై కూడా యాక్షన్ తీసుకుంటామని ఆయన హెచ్చరించాడు. షూటింగ్ పార్ట్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తొలుత ఈ నెలలోనే విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలన్స్ వర్క్స్ మంచి క్వాలిటీ తో ఉండడం కోసం మూవీ టీం గత నెలరోజులుగా లాస్ ఏంజిల్స్ లో కూర్చొని గ్రాఫిక్స్ వర్క్ చేయిస్తుంది. ఈ విషయాన్నీ స్వయంగా మంచి విష్ణు చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరి, లేదా మార్చి నెలలో ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. సంక్రాంతికి విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్. ఈ సినిమాతో అయినా మంచు విష్ణు భారీ హిట్ కొట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకుంటాడా లేదా అనేది చూడాలి.